ఐదేళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించినడ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దూకుడు పెంచింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన కేసును లోతుగా విచారించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర్నుంచి అన్ని రికార్డులను తెప్పించుకుంది.
ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులపై ఈడీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను పాటించలేదని.. విచారణకు సహకరించడం లేదని.. తాము కోరిన వివరాలు అందివ్వడం లేదంటూ ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 800 పేజీలతో కూడా నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది.
ఇందులో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమోదు చేయబడిన 12 ఎఫ్‌ఐఆర్ లతోపాటు చార్జిషీట్లు - నిందితులు మరియు సాక్షుల వివరాలు - వారి స్టేట్‌మెంట్లను పొందుపరిచారు. అలానే నిందితులు మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ సెలబ్రిటీలకు చెందిన 600 GB వీడియో రికార్డులు అందజేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు వీటితోపాటు మొత్తం 10 ఆడియో క్లిప్స్ - కాల్ డేటా కూడా హైకోర్టుకు సమర్పించిన వివరాల్లో ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానం వీటన్నింటినీ ఇప్పటికే ఈడీకి అందజేసింది. ఎక్సైజ్ శాఖ సమర్పించిన రికార్డులను దృవీకరించిన తర్వాత టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ మరింత వేగం పెంచనుందని సమాచారం.
డ్రగ్స్ కేసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. గతేడాది 12 మంది సినీ ప్రముఖులను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఈ కేసులో నిందితులు - సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి నెలలో ఎక్సైజ్ శాఖను ఈడీ కోరింది.
అయితే హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో ఈడీ కోరిన వివరాలను అందజేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో కోర్టు ధిక్కార కేసును ఈడీ ఉపసంహరించుకుంది. ఎక్సైజ్ శాఖ అందించిన వివరాలు పరిశీలించి అవసరమైతే మరోసారి సెలబ్రిటీలను ప్రశ్నించనున్నారు.