వీడియో టాక్‌: మసాలా మస్తుగా దట్టించేశారు

Update: 2016-03-27 09:03 GMT
కో కో కోడీ పుంజులివి.. అంటూ సాగే ఓ పాట ఇప్పుడు టాలీవుడ్‌ ను ఊపేస్తోంది. అవును ''ఈడో రకం ఆడో రకం'' సినిమాలోని ఈ పాట ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇంతకీ ఈ పాటలో అసలు ఏముందబ్బా?

ఒక ప్రక్కన విష్ణు మంచు.. మరో ప్రక్కన రాజ్‌ తరుణ్.. ఇద్దరూ తమ తమ హీరోయిన్లయిన సోనారికా బడోరియా అండ్‌ హెబా పటేల్‌ తో కలసి ఓ రేంజు స్టెప్పులేసి ఊపేశారంతే. ముఖ్యంగా పాట ప్రతీ లైనులో ఉన్న డబుల్ మీనింగ్‌ ఒకెత్తయితే.. సోనారికా అండ్‌ హెబా పటేల్‌ లు గ్లామర్‌ ఆరబోసిన తీరు ఇంకో ఎత్తు. ఇద్దరూ కూడా యమా హాటుగా ఉన్నారు. సోనారిక తన మిల్కీ అందాలతో ఊరిస్తుంటే.. హెబా పటేల్‌ తన కుమారి సొగసులతో చంపేసింది. మసాలా మస్తుగా దట్టించేసి ప్రేమ్‌ రక్షిత కొరియోగ్రాఫీలో వచ్చిన ఈ సాంగు టీజర్‌ ఇప్పుడు బి అండ్‌ సి ఆడియన్స్‌ ను తెగ ఊరిస్తోంది.

జి.నాగేశ్వర్‌ రెడ్డి డైరక్షన్‌ లో వస్తున్న ఈడోరకం ఆడోరకం సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Full View

Tags:    

Similar News