గేట్లు తీస్తున్న తెలుగు బ్రాండ్ బ్యూటీ

Update: 2019-03-29 01:30 GMT
ట్రైను జీవిత కాలం లేటు అనే సామెత లాగా పేరుకు తెలుగమ్మాయే అయినా అవకాశాలు ఒడిసిపట్టుకోవడంలో నేర్పరితనం మిస్ అవుతున్న ఈశా రెబ్బా ఫైనల్ గా కళ్ళు తెరిచింది. అర్థం కాలేదా. అదే గ్లామర్ గేట్లు తెరిచింది. ఐదేళ్ళ క్రితమే పరిశ్రమకు వచ్చినప్పటికీ ఈశాకు ఇప్పటిదాకా సరైన బ్రేక్ దొరకలేదు. అరవింద సమేత వీర రాఘవలో జూనియర్ ఎన్టీఆర్ తో నటించినప్పటికీ అది హీరొయిన్ పూజా హెగ్డే చెల్లిగా అంత ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో ఆశించిన ఫలితం దక్కలేదు.

అంతకు ముందు సోలో హీరొయిన్ గా చేసిన బ్రాండ్ బాబు డిజాస్టర్ పెద్ద దెబ్బే వేసింది. ఆఖరి హిట్ అమీ తుమి పేరు తెచ్చినా ఆఫర్లు మాత్రం మోసుకురాలేకపోయింది. అయితే వీటన్నింటిలో ఈశా రెబ్బ చాలా పరిమితులున్న డ్రెస్సింగ్ తో లిమిట్స్ పెట్టుకుని చేసింది.  దీని వల్లే తాను మనుగడ సాగించలేకపోతోందని గుర్తించిందో ఏమో కాని హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాని హోరేత్తిస్తోంది.

ముఖ్యంగా ఇవాళ క్లీవెజ్ ని హై లైట్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ కి అభిమానులు కాని వాళ్ళు కూడా ఫిదా అయిపోతున్నారు. మరి ఇది చూశాకైనా దర్శక నిర్మాతలకు తెలుగందంలోని గొప్పదనం కనిపిస్తుందని ప్లాన్ వేసింది కాబోలు. కాస్త హైటు ఎక్కువగా ఉండే ఈశా రెబ్బలో అందానికి లోటు లేకపోయినా టైం కలిసి రాక రేస్ లో వెనుకబడింది. మరి ఇప్పుడీ హాట్ ఫోటోస్ తో కోరుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News