ఈషా టెంప్టింగ్ లుక్.. బ్యాక్ ఫీట్ ల‌వ్ సింబ‌ల్

Update: 2021-12-09 23:30 GMT
ఈష రెబ్బ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. జోరుగా సినిమాలు చేయాల‌న్న త‌ప‌న‌తో దూసుకెళుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేయ‌క‌పోయినా కెరీర్ ప‌రంగా బాగానే మ్యానేజ్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఈ భామ‌కు రెవెన్యూ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇన్ స్టా వేదిక‌పై ఇప్ప‌టికే ఈష‌కు ల‌క్ష‌లాదిగా ఫాలోవ‌ర్స్ పెరిగారు.  ప‌లువురు కోస్టార్స్ తో క‌లిసి ఆన్ లైన్ ప్రొడ‌క్ట్స్ కి ప్ర‌మోష‌న్ చేస్తోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను అన్ స్టాప‌బుల్ గా షేర్ చేస్తోంది. వీటిలో తాజా ఫోటోషూట్ హీట్ పెంచుతోంది. ఇషా డిజైన‌ర్ దుస్తుల్లో త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది. ఇందులో బ్యాక్ ఫీట్ లో వీపందాన్ని ఎలివేట్ చేసిన ఫోటో సంథింగ్ హాట్ అనే చెప్పాలి. అలా వీపుపై ల‌వ్ సింబ‌ల్ క‌ర్వీగా క‌నిపిస్తూ క‌వ్విస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అనాహిత ఈ లుక్ కి స్టైలింగ్ చేశార‌ని ఈషా వెల్ల‌డించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌లే విడుద‌లైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో పెళ్లి చూపుల ఎపిసోడ్ లో న‌టించి మెప్పించింది ఈషా. అలాగే మ‌రిన్ని సినిమాల‌కు క‌మిటైనా లాక్ డౌన్ వ‌ల్ల వెయిటింగ్ లో ఉందిట‌. ఒట్టు అనే మ‌ల‌యాళ చిత్రంలో .. అయిర‌మ్ జేన్మ‌గ‌ల్ అనే త‌మిళ చిత్రంలోనూ ఈష న‌టిస్తోంది. ఈషా ప్ర‌స్తుతం ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. తెలుగులో త‌దుప‌రి సినిమాలేవీ అన్న‌దానికి స‌మాధాన‌మివ్వాల్సి ఉంది.
Tags:    

Similar News