డైరెక్ట్ ఓటీటీలోకి 'ఏక్ మినీ కథ'..?

Update: 2021-05-08 09:30 GMT
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభనతో సినీ పరిశ్రమలో గతేడాది పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఏప్రిల్ - మే నెలలో విడుదల చేయాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ ఇప్పటికే అయ్యాయి. అయితే పెద్ద సినిమాలు పరిస్థితులు చక్కబడితే విడుదల చేద్దామని వెయిట్ చేస్తుంటే.. చిన్న సినిమాలు మాత్రం మరో మార్గాన్ని చూసుకుంటున్నాయి. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇచ్చిన 'థ్యాంక్ యు బ్రదర్' చిత్రాన్ని 'ఆహా'లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని కూడా డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ - శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ''ఏక్ మినీ కథ''. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా పరిస్థితుల్లో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం మేకర్స్ కు డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు మధ్య బేరసారాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. నిజానికి యూవీ టీమ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతోందట. కానీ ఇప్పట్లో పరిస్థితులు చక్కబడతాయో లేదో తెలియడం లేదు కాబట్టి ఫ్యాన్సీ ఆఫర్ వస్తే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.
Tags:    

Similar News