‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ గా పాపులర్ అయిన బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మించిన `యే హై మొహబ్బతే` సీరియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీరియల్ కు ప్రారంభంలో విశేష ఆదరణ లభించింది. ఆ చిత్రంలో ఇషిత పాత్రకు మహిళా లోకం ఫిదా అయిపోయారు. దీంతో, మెల్లగా ఆ సీరియల్ ను ఏక్తా కపూర్ సా....గ దీస్తోంది. దీంతో, ఆ సీరియల్ లో పస తగ్గిందని...ఇకనైనా ఆపేయాలని....సోషల్ మీడియాలో #EndYHM పేరుతో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. నెటిజన్లు మాట పెడచెవిన పెట్టి.....పట్టువదలని విక్రమార్కురాలిలాగా ఏక్తా కపూర్ ఆ సీరియల్ ఎపిసోడ్లను కొండవీటి చాంతాడులా పెంచుకుంటూ పోతోంది. అసలే ఆ సీరియల్ పై నెటిజన్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలోనే తాజాగా ఆ సీరియల్ 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు ఏక్తా గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది. ఆ పార్టీలో ఏక్తా ధరించిన డ్రెస్ నెటిజన్లకు నచ్చకపోవడంతో...ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
ఆ పార్టీలో ఏక్తా....స్లీవ్ లెస్ మెరూన్ రఫెల్ గౌను - బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో...నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలే సీరియల్ పై విసిగివేసారి ఉన్న నెటిజన్లకు...ఆ సీరియల్ 1500 ఎపిసోడ్ల పార్టీ చేయడం.....అందులో ఏక్తా తనకు ఏమాత్రం సూట్ కాని డ్రెస్ వేసుకోవడం ...పుండు మీద కారం చల్లినట్లయింది. దాంతోపాటు, ఏక్తాపై ...ఆ సీరియల్ పై ఏకకాలంలో రివేంజ్ తీర్చుకునేందుకు నెటిజన్లు డిసైడ్ అయి ట్రోలింగ్ మొదలు పెట్టారు. సాగతీత కథనాలతో ఆ సీరియల్ చిరాకు తెప్పించినా ఓకే గానీ....ఈ తరహా డ్రెస్ లు వేసుకుంటే మాత్రం సహించబోమని కామెంట్స్ పెడుతున్నారు. డైనింగ్ హాలు నుంచి వస్తూ వస్తూ కర్టెన్ కప్పుకొని వచ్చారా...అంటూ ఆ డ్రెస్ పై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ డ్రెస్ రూపంలో ...ఏక్తాపై నెటిజన్లు రివేంజ్ తీర్చుకున్నారు. అయితే, గతంలోనూ ఏక్తా డ్రెస్ లపై, సందర్భరహిత వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరిగింది.