రోనా కల్లోలంలో అసహాయులను ఆదుకొని దేశవ్యాప్తంగా రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. నటుడిగానే కాదు.. మానవతావాదిగా. పేదలకు సాయం అందించే ఆపద్భాంధవుడిగా దేశం మొత్తానికి కరోనా విపత్కర పరిస్థితుల్లో నిలిచారు. ఈ క్రమంలోనే సోనూసూద్ రాజకీయాల్లోకి కూడా రావాలన్న డిమాండ్లు వినిపించాయి.
అయితే సోనూసూద్ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి చూపించడం లేదు. ఆయన సోదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. చెల్లి కోసం సోనూసూద్ దగ్గరుండి మరీ అన్నీ చూసుకుంటున్నారు. పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ చెల్లి పోటీచేస్తోంది.
ఈ క్రమంలోనే చెల్లి కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలనుకున్న సోనూసూద్ కు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఇవాళ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలోని మెగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోనూసూద్ సోదరి మావికా సూద్ కాంగ్రెస్ టికెట్ పై పోటీచేస్తోంది. ఈమెను సోనూసూద్ ప్రోత్సహిస్తున్నారు.
నామినేషన్ రోజు సోదరి వెంట సోనూసూద్ ఉన్నారు. ఎన్నికల రోజు కీలకం కావడంతో ఆయన మెగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని భావించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళుతున్న సోనూసూద్ పై ఎన్నికల కమిషన్ కు ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు.
సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు అనుమతించవద్దని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఆయన కారును సైతం అధికారులు స్వాధీనం చేసుకొని షాక్ ఇచ్చారు.
అయితే తాను ఓటర్లను ప్రభావతం చేస్తాననడంలో ఎలాంటి వాస్తవం లేదని.. తాను పంజాబ్ స్థానికుడిని అని.. కేవలం పోలింగ్ కేంద్రాల బయట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బూత్ ల వద్దకు మాత్రమే వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో ఇతర పార్టీల అభ్యర్థులు ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని సోనూసూద్ ట్వీట్ లో ఆరోపించారు. ఈ ట్వీట్ ను మో ప్రజా సంబంధాల అధికారికి, పోలీసులకు ట్యాగ్ చేశారు.