మీటూ : 68 కోట్ల తో సెటిల్‌ మెంట్‌ చేసుకుంది

Update: 2018-12-18 05:10 GMT
మీటూ ఉద్యమం మొదట హాలీవుడ్‌ లో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. హాలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్స్‌ పై హీరోయిన్స్‌ లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడంతో వారి పరువు పోయింది. కొందరు తమ పై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు న్యాయ పోరాటాలు చేస్తుంటే మరి కొందరు మాత్రం రాజీ కి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హాలీవుడ్‌ నటి ఎలిజా దుష్కు చేసిన మీటూ ఆరోపణలు ఒక సంస్థ నుండి ఆమె కు 68 కోట్లు తెచ్చి పెట్టాయి.

హాలీవుడ్‌ చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ లలో కూడా ఈమె నటించి మెప్పించింది. చాలా కాలం గా ఈమె సీబీఎస్‌ అనే సంస్థలో తెరకెక్కుతున్న ఒక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తుంది. ఆ వెబ్‌ సిరీస్‌ లో తన సహ నటుడు తనను లైంగికంగా వేదిస్తున్నాడు అంటూ ఆరోపించింది. చాలా కాలంగా ఆయన నాతో ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని, ఆయన వల్ల నేను మానసిక సంఘర్షణ కు లోనవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

సదరు నటుడి గురించి ఎలిజా దుష్కు ఆరోపణలు చేయడం తో సీబీఎస్‌ నిర్మాణ సంస్థ ఆ వెబ్‌ సిరీస్‌ నుండి ఈమె ను తొలగించడం జరిగింది. అకారణం గా తనను తొలగించారంటూ ఎలిజా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విచారణ తర్వాత ఆమెకు మద్దతుగా తీర్పు వచ్చింది. ఎలిజాను తొలగించినందుకు గాను సంస్థ ఆమె కు 68 కోట్లు నష్టపరిహారం గా ఇవ్వాల్సిందే అంటూ ఆదేశించింది. ఆమెకు ఆ మొత్తం ఇవ్వడంతో వివాదంకు తెర పడ్డట్లయ్యింది. ఎలిజా గతంలో ఒక యాంకర్‌ పై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. తనకు ఎదురయ్యే లైంగిక వేదింపులను ధైర్యంగా ముందు పెడుతున్న ఎలిజాను అంతా అభినందిస్తున్నారు.
Tags:    

Similar News