అజార్ పై నర్గీస్ వల్గర్ కామెంట్స్

Update: 2016-05-03 05:11 GMT
నర్గీస్ ఫక్రీ.. నేటివిటీ ప్రకారం పాకిస్తానీ అయినా.. అమెరికా నుంచి వచ్చి బాలీవుడ్ లో జెండా పాతింది ఈ భామ. రాక్ స్టార్ మూవీతో అరంగేట్రం చేసిన ఈ భామకు.. టూ పీస్ బికినీలు -లిప్ లాక్ ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో.. అవకాశాలకు కొదువేం లేదు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్రపై తీస్తున్న అజార్ మూవీలో.. సంగీతా బిజిలానీ పాత్ర చేస్తోంది నర్గీస్.

ఈ మూవీ విషయంలో నర్గీస్ ఫక్రీ చేస్తున్న కామెంట్స్ వివాదాలు సృష్టిస్తున్నాయి. ముద్దు సీన్ల విషయంలో అమ్మడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 'సినిమాలో ఇన్ని ముద్దు సీన్స్ ఉంటాయని తెలీదు. పైగా ఇప్పుడు హాట్ హాట్ సీన్లను రీషూట్ చేయాలని నిర్ణయించారు. అందుకే ఎక్ స్ట్రా లిప్ లాక్ సీన్స్ చేయాలంటే. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాను' అంటోంది నర్గీస్.

ఇదే ఓ గొడవ అంటే.. ఇంతకు మించి మరో అసభ్యకరమైన వ్యాఖ్య కూడా చేసింది. 'ఇమ్రాన్ హష్మీ ఓ ఆర్టిఫిషియల్ మీసంతో కనిపిస్తాడు. ఈ మీసంతో మళ్లీ మళ్లీ ముద్దు పెట్టాలంటే చికాగ్గా ఉంది. ఈ మీసకట్టును ప్యూబిక్ హెయిర్(కటి ప్రాంతం నుంచి తొలగించిన జుట్టు) తో చేశారని నా అనుమానం. అందుకే అతన్ని ముద్దు పెట్టుకోవడంలో నాకు బాగా అసహ్యంగా అనిపిస్తోంది' అంటూ నర్గీస్ చెప్పడంతో.. అందరూ నోరెళ్లబెట్టేశారు. అయితే ఇమ్రాన్ మాత్రం మంచి నటుడని, చాలా కూల్ అని చెప్పడం విశేషం.
Tags:    

Similar News