రియల్ లైఫ్ లో హీరోయిన్ కు హీరో మసాజ్

Update: 2016-04-10 04:52 GMT
సెలబ్రిటీలకు ఈగోలు చాలా ఎక్కువని చెబుతుంటారు. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే సినిమా రంగంలో హీరోలు చూపించే రాజసం అంతాఇంతా కాదంటారు. రెమ్యూనరేషన్ మొదలుకొని.. ట్రీట్ మెంట్ వరకూ అన్ని విషయాల్లోనూ హీరో తర్వాతే హీరోయిన్. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఇలాంటి ఇండస్ట్రీలో హీరోయిన్ కష్టాలు చూసి.. ఈగోల్ని పక్కన పెట్టేసి.. ఒక సాదాసీదా మనిషిగా రియాక్ట్ కావటం కాస్త కష్టమే. అందులోకి అందరి ముందు మరో ఆలోచన లేకుండా కాళ్లు వత్తేందుకు (మసాజ్) సైతం వెనుకాడకపోవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. హీరోగారి పెద్దమనసును గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇంతకీ హీరోయిన్ కాళ్లు వొత్తిన ఆ హీరో ఎవరంటే.. సీరియల్ కిస్సర్ గా పేరున్నబాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. సీరియల్ కిస్సర్ గా అతగాడికి ఉన్న ఇమేజ్ కి అతనికి ఎక్కడా పోలిక లేదని చెబుతారు. నిజానికి కిస్ సీన్లు చేయటానికి ఇమ్రాన్ హష్మీకి పెద్దగా ఇంట్రస్ట్ ఉండదని చెబుతుంటారు. తాజాగా ఆయన టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న ‘అజార్’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా తాజాగా లండన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో కారు పార్కింగ్ కు అవకాశం లేకపోవటంతో యూనిట్ చాలా దూరం నడవాల్సి వచ్చింది.

సన్నజాజి మొగ్గలా సుకుమారంగా ఉండే ఆ సినిమా నటిస్తున్న హీరోయిన నర్గీస్ ఫక్రీ కాళ్ల నొప్పులతో కూలబడింది. విపరీతమైన నొప్పులు బాధిస్తుండటంతో ఆమె నడవలేకపోయింది. దీంతో.. ఏ మాత్రం భేషజానికి పోకుండా ఇమ్రాన్ హష్మీ ఆమె కాళ్లకు మసాజ్ చేశాడు. అతగాడి మసాజ్ తో తేలికపడి ఆమె మామూలు మనిషైందట. కాళ్ల నొప్పులు తగ్గిన తర్వాత మసాజ్ చేస్తావా? అంటూ ఫక్రీ టీజ్ చేసినా లైట్ తీసుకోవటం హష్మీకి మాత్రమే చెల్లుతుందని గొప్పగా చెప్పుకొచ్చాడు ఆ సినిమా దర్శకుడు టోనీ డిసౌజా. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఊహించగలమా?
Tags:    

Similar News