సెక్సీ చరణ్‌ ఫ్యాన్.. తెలుగులో కన్ఫామ్

Update: 2016-08-30 09:30 GMT
గతంలో ఓసారి నీకు సౌత్ లో ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే.. మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్ బ్యూటి ఈషా గుప్తా ఏమందో తెలుసా? వెంటనే అమ్మడు రామ్ చరణ్‌ పేరు చెప్పేసింది. తుఫాన్ సినిమా చూసి మనోడి ఫ్యాన్ అయిపోయాను అంటూ చెప్పిందిలే. అయితే అమ్మడు తన ఫ్యానిజం ఎన్నిసార్లు చూపించినా కూడా మెగా క్యాంపు నుండి మాత్రం ఒక్క కాల్ కూడా రాలేదు. ఇక హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి బాలీవుడ్ లో స్ర్టగుల్ అవుతోంది కాబట్టి.. టాలీవుడ్ లో అవకాశం వస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుంది పరిస్థితి. ఈ 30 ఏళ్ళ హాటీకి చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలున్నప్పటికీ.. వాటిల్లో ఈమె హీరోయిన్ కాదులే. మొన్నవచ్చిన 'రుస్తుం' సినిమా తరహాలో ఒక సైడ్ క్యారెక్టర్ అంతే.

ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ నుండి ఎట్టకేలకు పిలుపు వచ్చేసింది. అమ్మడి హైటు.. ఫిజిక్.. ఆ ఫ్రేమ్ అండ్ కటౌట్ చూస్తే.. చాలా హాటుగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా ఈమెకు బాగా సెట్టవుతుంది. అందుకే హీరో నిఖిల్ తదుపరి సినిమాలో ఒక పోలీస్ రోల్ చేయాల్సిందిగా ఈమెను ఎప్రోచ్ అయ్యాడట దర్శకుడు సుధీర్ వర్మ. 'స్వామి రారా' కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆఫర్ తో వెంటనే ఎగిరి గంతేసిన ఈషా.. ఆ రోల్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సెలవిచ్చింది. అయితే ఈ రోల్ చేయడానికి పారితోషకం విషయంలో మాత్రం కాస్త ఫిట్టింద్ ఏదో ఉందట.. కాని అది కూడా సెటిల్ అయిపోయి త్వరలోనే డాటెడ్ లైన్ పై అమ్మడు సంతకం చేస్తోందని వినిపిస్తోంది. ఆ విధంగా చరణ్‌ ఫ్యాన్ తెలుగులోకి అడుగుపెడుతోంది.
Tags:    

Similar News