ప్రీలుక్: మీట్ Mr. విక్రమ్ వాసుదేవ్

Update: 2019-07-09 06:57 GMT
టాలీవుడ్లో ఇప్పుడు యంగ్ జెనరేషన్ యాక్టర్లు.. డైరెక్టర్ల హవా కొనసాగుతోంది. 'క్షణం'.. 'గూఢచారి' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చాటిన అడివి శేష్ తాజాగా 'ఎవరు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమా ప్రీ లుక్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

ప్రీ లుక్ లో కథకు సంబంధించిన విశేషాలు ఏవీ వెల్లడించలేదు కానీ ఈ సినిమాలో శేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతిని మాత్రం రివీల్ చేశారు.  ఈ ప్రీ లుక్ పోస్టర్ లో  శేష్ ఒక పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు.  ఈ సినిమాలో 'విక్రమ్ వాసుదేవ్' పాత్రలో శేష్ నటిస్తున్నట్టు అయన యూనిఫామ్ పై ఉన్న బాడ్జ్ చెప్తోంది.  కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.  ఈ పోస్టర్ లో 'జులై 11 న ఫస్ట్ లుక్ విడుదల' అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే డేట్ ను వెల్లడించారు.

ఈ సినిమాలో రెజీనా కసాండ్రా.. మురళి శర్మ.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించినవారు శ్రీచరణ్ పాకాల.  వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.  'క్షణం' తర్వాత పీవీపీ బ్యానర్ లో అడివి శేష్  మరోసారి నటిస్తున్న సినిమా ఇది.  మరి 'క్షణం' తరహాలోనే పీవీపీ బ్యానర్ కు మరో విజయాన్ని అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News