ఎంత పాపులర్ సెలబ్రిటీ ప్రమోట్ చేశాడన్నది ఇప్పడు ప్రేక్షకుడు చూసి సినిమాకు బ్రహ్మరథం పట్టే రోజులు పోయాయని `బ్రహ్మాస్త్ర` ఫలితంతో మరోసారి రుజువైంది. బాలీవుడ్ సినిమాలు గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటూ డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. పేరుతున్న, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్టార్ లు నటించిన భారీ సినిమాలు కూడా బొక్కబోర్లా పడుతున్నాయి. కోట్లల్లో నష్టాలని చివి చూస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అనిపించుకుంది.
ఈ మూవీతో అయినా బాలీవుడ్ బయటపడుతుందని అంతా భావించారు. అమీర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అంతా ఊహించని విధంగా ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. ఇక ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటించిన `రక్షా బంధన్` కూడా ఇదే బాటపట్టంతో అందరి దృష్టి రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, నాగార్జున, కీలక అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
టీజర్, ట్రైలర్ నుంచి మంచి బజ్ క్రియేట్ అయిన ఈ మూవీకి తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించినా దేశం మొత్తం `బ్రహ్మాస్త్ర` టీమ్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఎన్టీఆర్ కూడా తన వంతు బాధ్యతగా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. దీంతో ఈ మూవీపై మరింతగా బజ్ క్రియేట్ అయింది. రాజమౌళి ముందుండి నడిపించడంతో సినిమాకు ఇక అడ్డూ అదుపూ లేదని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు.
రాజమౌళి ఎంతగా ఈ మూవీని ప్రమోట్ చేసినా ఉండాల్సిన స్టఫ్ సినిమాలో లేకపోతే స్టార్స్ ముందుండి ప్రచారం చేసినా ఎలాంటి ప్రయోజనం వుండదని `బ్రహ్మాస్త్ర`తో మరోసారి నిరూపణ అయింది. సకల అస్త్రాలకు అధిపతి `బ్రహ్మాస్త్రం`. దుష్టులకు చిక్కకుండా ఓ గ్రూపు 3 భాగాలుగా చేసి బ్రహ్మాస్త్రాన్ని దుష్టుల భారిన పడకుండా కాపాడుతుంది. దీన్ని దక్కించుకోవడానికి దుష్టశక్తులు చేసే ప్రయత్నం.. వారిని అడ్డుకోవడానికి ఒక బృందం చేసే పోరాటం నేపథ్యంలో నడిచే కథతో మన పురాణ గాథలను గుర్తు చేసేలా బ్రహ్మాస్త్ర సాగుతుంది. అయితే ఈ కథని సగటు ప్రేక్షకుడు ఓన్ చేసుకునే విధంగా తర్శకుడు చెప్పలేకపోయాడు.
దీనికి తోడు గ్రాఫిక్స్ కూడా సహజంగా అనిపించకుండా.. ఆర్టిఫీషియల్ ఫీలింగ్ ని కలిగించడంతో ప్రేక్షకుడు కరెక్ట్ కాలేకపోయాడు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ లో ఉన్న భారీతనం వల్ల.. యాక్షన్ ఘట్టాలను బాగా తీర్చిదిద్దడం వల్ల మాస్ ప్రేక్షకులు కొంత వరకు సినిమాతో కనెక్ట్ కావచ్చేమో కానీ.. మిగతా వాళ్లందరికీ బ్రహ్మాస్త్ర శిరోభారంగానే తయారవుతుంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ వున్నా.. తెరపై కథని ఎంగేజింగ్ గా నడపడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. విజువల్స్ పై వునన్న శ్రద్ధ కథనంపై లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి తెరపై ఏదో జరుగుతోంది అన్న ఫీలింగ్ తప్ప మరేమీ అనిపించదు. ఫైనల్ గా ఈ సినిమాతో మరోసారి తేలింది ఏంటంటే రాజమౌళి లాంటి పేరున్న వారు ప్రమోట్ చేసినా..వందల కోట్ల బడ్జెట్.. కళ్లు చెదిరే విజువల్స్ వున్నా సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు పట్టించుకోరని మరోసారి స్పష్టమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.