మేకప్ వద్దన్నారు.. కానీ ఆ విషయంలో సుఖపడ్డాను: ఏ1 బ్యూటీ

Update: 2021-03-03 04:30 GMT
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘ఎ1ఎక్స్‌ప్రెస్’ విడుదల కోసం ఎదురుచూస్తుంది. అయితే ఇటీవలే ఇంటర్వ్యూలో సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది లావణ్య. తాజాగా ఈ సినిమా టైంలో తనకు సంబంధించిన విషయం ఒకటి షేర్ చేసుకుంది. ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ గా కనిపించనుంది. అయితే తన పాత్రకోసం లావణ్య మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని ముందుగానే మేకర్స్ ఇన్ఫర్మ్ చేసినట్లు చెబుతోంది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ తన చర్మం పై మేకప్ చుక్క కనిపించినా తీసేయాలని చెప్పినట్లు తెలిపింది.

అయితే లావణ్య మాట్లాడుతూ.. 'నిజానికి నేను మేకప్ వేసుకుంటే అక్కడ సమస్య క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నాకు మంచి స్కిన్ ఉంది. ఒక్కోసారి మేకప్ జస్ట్ డ్రాప్ అంతే ఉపయోగించేదాన్ని. కానీ అదికూడా గమనించి తొలగించాలని చెప్పేవారు మేకర్స్' అని జరిగింది చెప్పింది అమ్మడు. అయితే వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్రలకు మేకప్ వేయాలని ఎవరు అనుకోరు. అందులోను ఒక క్రీడాకారిణి పాత్రకు అంటే అవసరం లేదు. ఆమె నేచురల్ గ్లోనే స్క్రీన్ పై రిఫ్లెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే లావణ్యకు స్పోర్ట్స్ షార్ట్స్ ధరించడమే సుఖంగా ఉందట. షార్ట్స్ ధరించినప్పుడు తను పూర్తి కంఫర్ట్ జోన్ లో ఉన్నానంటూ.. అలాగే సాంగ్స్ కోసం అలాంటి గ్లామరస్ డ్రెస్సులు కూడా ఊహించలేదని అంటోంది. సందీప్ కిషన్, లావణ్య ప్రధానపాత్రలలో నటించిన ఈ 'ఏ1 ఎక్సప్రెస్' మూవీ మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Tags:    

Similar News