నానీ.. వెయిటింగ్ ఫర్ యు

Update: 2017-01-28 10:11 GMT
సంక్రాంతి సినిమాలు వచ్చి రెండు వారాలు దాటిపోయింది. ఆ సినిమాల జోరు చూశాక తర్వాతి వారం అసలే సినిమాలూ రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం అనుకోకుండా విడుదలైన ‘లక్కున్నోడు’కు అంత బజ్ రాలేదు. పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం.. విడుదల రోజు ఫోకస్ అంతా విశాఖపట్నం నిరసన కార్యక్రమం మీదే నిలిచింది. దీంతో ఈ సినిమా విడుదలైనట్లే అనిపించట్లేదు జనాలకు. సినిమాకు టాక్ కూడా యావరేజ్‌ గానే ఉంది. ఇక సినీ ప్రియుల ఫోకస్ అంతా తర్వాతి వారం విడుదల కాబోతున్న నాని సినిమా ‘నేను లోకల్’ మీదే ఉంది. నాని వరుసగా ఐదు సక్సెస్ ఫుల్ సినిమాలతో ఊపుమీదున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది.

‘నేను లోకల్’ ఆడియో సూపర్ హిట్టయింది. ఇందులోని ‘నెక్స్ట్ ఏంటి’ పాట ప్రస్తుతం ఎఫ్ ఎం రేడియోల్లో మార్మోగిపోతోంది. మిగతా పాటలు కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. ఆల్రెడీ దిల్ రాజు సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టించేశాడు. ‘నేను లోకల్’ ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్‌గా ఉండటంతో సినిమా మీద బజ్ మరింత పెరిగింది. సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టేయడం గ్యారెంటీ అన్న ఫీలింగ్‌ లో ఉన్నారు జనాలంతా. సినిమా సినిమాకూ తన రేంజి పెంచుకుంటూ.. ఎక్కువమంది జనాల్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు నాని. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. కలెక్షన్లు ఓ రేంజిలో ఉంటాయని.. ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News