ఈ క్రిస్మస్ పండక్కి ఏకంగా నాలుగు సినిమాలొచ్చాయి. అందులో సౌఖ్యం - మామ మంచు అల్లుడు కంచు కొంచెం పెద్ద రేంజి సినిమాలు కాగా.. భలే మంచి రోజు - జత కలిసే చిన్నవి. మరి ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో ఇంత ధైర్యంగా ఢీకొడుతున్నయేంటి అనుకున్నారు జనాలు. ఇది పెద్ద రిస్క్ అని అభిప్రాయపడ్డారు. ఐతే ఆ రిస్కే ఇప్పుడీ సినిమాలకు కలిసొస్తోంది. ఈ రెంటికి మంచి టాక్ రాగా.. సౌఖ్యం - మామ మంచు.. సినిమాల పరిస్థితే ఏమంత బాగా లేదు. వాటికి వచ్చిన నెగెటివ్ టాక్ భలే మంచి రోజు - జత కలిసే సినిమాలకు మరింతగా కలిసొస్తోంది. క్రిస్మస్ సెలవుల అడ్వాంటేజిని వాడుకుని ఇవి రెండూ అనుకున్న దాని కంటే పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి చూసి.. శర్వానంద్ కూడా స్ట్రాటజిక్ గా సంక్రాంతి రేసులోకి దిగాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో ఉన్న మిగతా మూడు సినిమాలో చాలా భారీవే. వాటి మధ్యన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ పోటీలోకి దిగడం చాలా పెద్ద రిస్కే గానీ.. క్రిస్మస్ సినిమాల్లాగే సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాల్లోనూ దేని రిజల్ట్ అయినా తేడా వస్తే అది తమ సినిమాకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు యువి క్రియేషన్స్ వాళ్లు. సంక్రాంతి అనేది సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్. జనాలు కూడా ఆ సెలవుల్లో సినిమాలు చూడ్డానికి బాగా ఇష్టపడతారు. కాబట్టి కొంచెం పోటీ ఎక్కువైనా వసూళ్లకు ఢోకా ఉండదు. అందుకే సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్న యవి క్రియేషన్స్ సంక్రాంతి బరిలో దిగడానికే సిద్ధమవుతున్నారు. రేసులో ఉన్న మిగతా మూడు సినిమాల్లో ఒకదాని ఫలితం తేడా వచ్చినా అది తమ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ అవుతాయని ఆశిస్తున్నారు. మరి బడా సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.