ప్రేక్షకులను మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు సిద్ధమైంది అనిల్ గ్యాంగ్. ఎఫ్-2 మూవీతో రావిపూడి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2019లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ దూసుకొచ్చిన వెంకటేష్, వరుణ్.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్ టైన్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు మరోసారి ఎఫ్-3 అంటూ రాబోతున్నారు.
అయితే.. ఇది ఎఫ్-2కు సీక్వెల్ కాదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని డిసెంబర్ లోనే సెట్స్ పైకి వెళ్లింది ఎఫ్-3 చిత్రం. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెంకీ, వరుణ్ ఫ్యాన్స్ తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
అయితే.. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీని సమ్మర్ సీజన్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ రూపొందిస్తున్నాడట దర్శకుడు. ఈ చిత్రం షూట్ మొత్తం ఏప్రిల్ చివరి నాటికి ఫినిష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి, మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇక, బ్యాలెన్స్ షూట్ ఉన్న చిత్రాలు కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇవన్నీ సమ్మర్ సీజన్ లక్ష్యంగా సిద్ధమవుతున్నాయి. ఇందులో పవన్ వకీల్ సాబ్, ప్రభాస్ రాధేశ్యామ్ సహా చాలా చిత్రాలు ఉన్నాయి.
ఇప్పుడు ఎఫ్-3ని కూడా సమ్మర్ బరిలో నిలిపేందుకు ట్రై చేస్తోంది యూనిట్. చివరి నిమిషంలో చాలా సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తుంటారు. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వేసవిలో కర్చీఫ్ వేసే ప్లాన్ లో ఉందట ఎఫ్-3 టీమ్. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ప్రణాళిక వేసినట్లు టాక్.