దేశవిదేశాల్లో చర్చనీయాంశమై.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న జక్కన్న విజువల్ వండర్ ‘బాహుబలి’ మరో గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘ఫేస్ బుక్’ 2015 రివ్యూలో ఇండియా నుంచి ‘బాహుబలి’కి స్థానం దక్కింది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన అంశాలతో ఫేస్ బుక్ రివ్యూ వీడియోను రూపొందిస్తుంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ‘ఫేస్ బుక్ రివ్యూ-2015’ పేరుతో ఓ వీడియో తయారు చేసింది. అందులో పారిస్ ఉగ్రవాదుల దాడి దగ్గర్నుంచి ఎన్నో అంశాలకు చోటిచ్చారు. అందులో ‘బాహుబలి’కి కూడా చోటివ్వడం విశేషం.
జలపాతం దగ్గర వయ్యారంగా నిలుచున్న తమన్నాకు సంబంధించిన విజువల్ ను ఇందులో చూపించారు. మన దేశ ఎంటర్టైన్మెంట్ రంగంలో మరో అంశానికీ ఇందులో చోటు దక్కలేదు. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ చర్చనీయాంశమైన విషయాన్ని ఫేస్ బుక్ గుర్తించడం విశేషం. ఇక ఇండియా వరకు అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లోనూ బాహుబలికి ఫేస్ బుక్ చోటిచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన ‘బాహుబలి’ ఇప్పటికే అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికే చాలా దేశాల్లో విడుదలైన ఈ సినిమా మరిన్ని దేశాల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది.