ట్రెండీ టాక్‌: పుష్ప‌రాజ్ తో ఢీ అంటే ఢీ

Update: 2021-08-18 02:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`లో ద‌ర్శ‌కుడు సుకుమార్  బిగ్ స్టార్స్ ని భాగం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర భాష‌ల్లో పాపులరైన న‌టుల్ని ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారు. ఆ ర‌కంగా సినిమాకు మంచి బిజినెస్ అయ్యేలా ప‌క్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మ‌ల‌యాళం లో ఫేమ‌స్ అయిన ఫ‌హద్ ఫాజిల్ ని రంగంలోకి దించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో జాతీయ ఉత్త‌మ‌న‌టుడు ఫ‌హద్ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయ‌న పాత్ర చాలా ఫవ‌ర్ ఫుల్ గా ఉండ‌బోతుంది. బ‌న్నీ-ప‌హ‌ద్ ఫాజిల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ని ఇప్ప‌టికే యూనిట్ రివీల్ చేసింది.

ఇప్ప‌టికే మేక‌ర్స్ ప‌హ‌ద్ పై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ప‌హ‌ద్ షూటింగ్ లో పాల్గొన‌లేదు. దీంతో టీమ్ ఇత‌ర న‌టీన‌టుల‌పై నే షూట్ చేసారు. తాజాగా నెల 20 నుంచి ప‌హ‌ద్ ఫాజిల్ మ‌ళ్లీ పుష్ప షూటింగ్ లో పాల్గొన‌బోతున్నారు. నాటి నుంచి ఏక‌ధాటిగా ఆయ‌న‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ప‌హ‌ద్ పై చేయాల్సిన స‌న్నివేశాలు అన్నింటిని ఈ షెడ్యూల్ లో పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిసింది. వ‌చ్చె నెలాఖ‌రుక‌ల్లా  `పుష్ప` షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. మొత్తం రెండు భాగాలుగా పుష్ప తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

షూటింగ్ పూర్తికాగానే యూనిట్ పూర్తి స్థాయిలో ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్నం కానుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి మొద‌టి భాగాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా  డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అటుపై రెండ‌వ  భాగాన్ని కూడా వీలైనం త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువారాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  తొలి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News