ఫేక్ న్యూస్ : అమితాబ్ కు అవమానం జరిగిందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు..!

Update: 2022-08-27 08:55 GMT
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ని స్టూడియో గేట్ వద్ద ఆపేసి అవమానించారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు ఖండించాయి. అది ఫేక్ న్యూస్ అని.. అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదని తెలిపారు. అసలు పెద్దాయన కి సంబందించిన షూటింగ్ నే ఇక్కడ జరగలేదు అని తెలిపారు.

భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ స్టూడియోకి వస్తున్నారంటే ముందుగానే తగిన ఏర్పాట్లు చేస్తామని.. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ లెజండరీ నటుడికి ఇబ్బంది కలిగించారని ఎవరో కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్టూడియో వర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News