కలెక్షన్స్ కు కవరింగ్ ఇవ్వాలట..!

Update: 2018-10-13 18:41 GMT
సినిమా బాగుందా లేదా అనే టాపిక్ కంటే సినిమా కలెక్షన్స్ ఎంత.. ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది.. ఇదే ఫ్యాన్స్ కు కావలసింది.  దీంతో ఫిలింమేకర్స్ కూడా రిలీజ్ కాగానే బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసేస్తారు.  ఇక రెండో రోజునుండి అమెరికా లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ ప్రచారం ప్రారంభం అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాన్ - బాహుబలి లెక్కల చిట్టాలు విప్పుతారు. ఆ హీరో ఈ హీరో అని తేడాలేదు అందరిదీ ఇదే ట్రెండ్. ఒకవేళ హీరోలకు తెలిసినా తెలియకపోయినా నిర్మాతలు ఆ విషయాలు చూసుకుంటారు. కొన్ని సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ విషయంలో గతంలో జరిగిన  హంగామా అందరికీ తెలిసిందే.

ఈమధ్య రిలీజ్ అయిన ఒక సినిమా యాక్చువల్  కలెక్షన్స్ వివరాలు బయటకు చెప్పొద్దని 10-15 % పెంచి ఆ ఫిగర్ ను బయటకు చెప్పాలని ప్రొడక్షన్ టీం మెంబర్ ఒకరు డిస్ట్రిబ్యూటర్లతో చెప్పారట. ఇదిలా ఉంటే మొదటి వారం ఏపీలో టికెట్ రేట్లు పెంచడం.. 6 షో లు లాంటి వాటితో ఓపెనింగ్ డే కలెక్షన్స్ మాత్రం భారీగానే నమోదయ్యాయి.  వీటి ఇంపాక్ట్ రెండో రోజు శుక్రవారం బీ సీ సెంటర్ల కలెక్షన్స్ పై పడినట్టు వార్తలు వస్తున్నాయి.  కానీ టికెట్ రేట్లు ఎక్కువ ఉండడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఫిగర్ లో తేడా రాలేదట.

సహజంగా కలెక్షన్స్ ఫిగర్ పెంచి చెప్పాలనే రిక్వెస్టులు ఫ్యాన్స్ అసోసియేషన్స్ నుండి వస్తాయి.. కానీ ఈసారి నిర్మాతల తరఫునుండి రావడం చిత్రమైన విషయమే. మరి సదరు నిర్మాత లాస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది కాబట్టి ఈసారి ఎలాగైనా తమ హిట్ అనిపించుకోవడానికి ఇలా చేస్తున్నాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News