తమిళ లెజెండ్ ని తెలుగులోకి తీసుకొస్తున్న ప్రముఖ నిర్మాత..!

Update: 2022-07-13 15:30 GMT
శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళనాడులో 'లెజెండ్ శరవణన్' గా పిలవబడే ఈ బిజినెస్ మ్యాన్.. తన వ్యాపార ప్రకటనల్లో హీరోయిన్లతో కలసి నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఇప్పుడు "ది లెజెండ్" అనే చిత్రంతో హీరో అవతరమెత్తాడు.

భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ తో అగ్ర హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా "ది లెజెండ్" సినిమాని తెరకెక్కించారు. ఇందులో ఊర్వశీ రౌతెలా - లక్ష్మీ రాయ్ హీరోయిన్లుగా నటించారు. లెజెండ్ శరవణన్ స్వీయ నిర్మాణంలో జెడి - జెర్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'ది లెజెండ్' చిత్రాన్ని జూలై 28న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. లెజండ్ శరవణన్ నటించిన 'ది లెజెండ్' చిత్రాన్ని తెలుగు రాష్ట్రల్లో విడుదల చేయడానికి లెజెండ్ శరవణన్ స్టోర్స్ ప్రొడక్షన్స్ తో శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ కలవడం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత తిరుపతి ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

'ది లెజెండ్' చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చగా.. వేల్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - లత - కోవైసరళ - యోగిబాబు వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల పూజా హెగ్డే - తమన్నా భాటియా - హన్సిక - శ్రీలీల - శ్రద్ధా శ్రీనాథ్ - డింపుల్ హయతి సహా పది మంది హీరోయిన్లు గెస్టులుగా ఆడియో వేడుక నిర్వహించారు. ఈ క్రమంలో వచ్చిన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.

డెబ్యూ మూవీతోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని భావిస్తున్న శరవణన్.. దూకుడుగా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ - స్టార్డమ్ ఉన్న హీరోల సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న ఈ రోజుల్లో.. టాప్ హీరో రేంజ్ లో భారీ స్థాయిలో తెరక్కించిన 'ది లెజండ్' సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News