ప్రభాస్ బాహుబలి సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డం దక్కించుకుని ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ స్టార్ డంలోనే కాకుండా మంచి మనసులో కూడా ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా ఈమద్య కాలంలో పేరు దక్కించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా ప్రభాస్ వరుసగా కోట్లకు కోట్లు విరాళాలు అందిస్తూ తన మంచి మనసును చాటుకున్నాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా స్టార్స్ అంతా కూడా ఒక్క చెట్టు పెట్టి తమ బాధ్యతను దులిపేసుకున్నారు. కాని ప్రభాస్ మాత్రం ఏకంగా ఒక అడవినే దత్తత తీసుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు.
ప్రభాస్ అభిమానులు సైతం ఆయన్ను ఫాలో అవుతున్నారు. వందలాది మంది ప్రభాస్ అభిమానులు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వేలాది మొక్కలు నాటారు. కర్ణాటకలోని ప్రభాస్ అభిమానులు ఏకంగా ఒక అడవిని క్రియేట్ చేసి హీరోకు తగ్గ అభిమానులుగా నిరూపించుకున్నారు. తమ అభిమాన హీరో మాదిరిగా తాము కూడా రియల్ హీరోలం అంటూ నిరూపించుకున్నారు.
కన్నడకు చెందిన ఆ అభిమానులు ఒక ఆసుపత్రితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఒక మినీ ఫారెస్ట్ ను క్రియేట్ చేశారు. ఆ ఫారెస్ట్ ను ప్రభాస్ మరియు కృష్ణంరాజులకు అంకితం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభాస్ అభిమానులు చేసిన ఈ మంచి పనిని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రభాస్ అభిమానులకు ఆయన అభినందనలు తెలియజేయడంతో పాటు ఫొటోలను కూడా షేర్ చేశారు.