బాలీవుడ్ స్టైలిష్ పెయిర్ విడిపోయింది

Update: 2016-01-21 15:30 GMT
ఫ‌ర్హాన్ అక్త‌ర్‌ - అధునా.. బాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ జంట‌. అత‌డి కంటే ఆమె వ‌య‌సు ఆరేళ్లు ఎక్కువైనా.. ఇద్ద‌రికీ జోడీ కుద‌ర‌న‌ట్లు క‌నిపించినా... బాలీవుడ్ లో ఈ జంట చాలా ఫేమ‌స్‌. 2000లో 'దిల్‌ చాహ్‌తా హై' సినిమా ద్వారా దర్శకుడిగా ఫర్హాన్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ సమయంలో అధునా అత‌డికి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. బాలీవుడ్ లో ఏ వేడుక జ‌రిగినా వీళ్లిద్ద‌రూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేవారు.బాలీవుడ్‌ లోనే మోస్ట్ స్టైలిష్‌ జంటగా వీరికి పేరుంది. అలాంటి జంట ఇప్పుడు విడిపోయింది. త‌మ 15 ఏళ్ల వివాహ బంధానికి తెరదించింది.

తాను, అధునా మ్యూచువ‌ల్ అండ‌ర్ స్టాండింగ్ తో విడిపోతున్న‌ట్లు ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు.‘‘మేం సామరస్యంగా ఉమ్మడి సమ్మతి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు మా పిల్లలే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వారిని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఎలాంటి ఊహాగానాల‌కు తావు లేకుండా..మేం హుందాగా ముందుకు సాగేందుకు వీలుగా మా ప్రైవసీని గౌరవించాలని కోరుతూ ప్రకటన విడుదల చేస్తున్నాం’’ అని ఫ‌ర్హాన్ పేర్కొన్నాడు.ఫ‌ర్హాన్‌ - అధునా జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. గ‌త కొంత కాలంగా ఈ జంట బ‌య‌టెక్క‌డా క‌లిసి క‌నిపించ‌ట్లేదు.
Tags:    

Similar News