టార్గెట్ ఫిక్స్ చేసిన చిట్టి..5 ఏళ్ళ‌లో ఇండియానే దున్నేయాలి!

Update: 2022-10-30 01:30 GMT
'జాతిరత్నాలు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ని పెంచుకున్న సంగతి తెలిసినదే. ఫరియా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని కుర్రకారులో క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది.   సోషల్ మీడియాలోనూ అమ్మడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది.  నాటి నుంచి ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో అభిమానులకు టచ్ లో ఉంటూ అప్ డేట్స్ ఇస్తోంది ఫరియా.

తొలి సినిమా స‌క్సెస్ తో అమ్మ‌డికి మీడియం బ‌డ్జెట్ చిత్రాల్లో బాగానే అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. నేరుగా హీరోయిన్ ఛాన్సులు కాక‌పోయినా ఓర‌క‌మైన గుర్తించ ద‌గ్గ పాత్ర‌ల్లో అందుకుంటుంది. మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిల‌ర్..బంగార్రాజు చిత్రాల్లో న‌టించింది.  ప్ర‌స్తుతం 'లైక్ షేర్ అండ్ సబ్ స్ర్కైబ్ '..'రావ‌ణ‌సూర' చిత్రాల్లో న‌టిస్తోంది. తాజాగా అమ్మ‌డు ఓ ఇంట‌ర్వ్యూలో త‌న డ్రీమ్ గురించి రివీల్ చేసి అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసింది.

హీరోయిన్ గా ఫ‌రియా దేశాన్నే ఏలేయాల‌ని చూస్తుంది. ఒక‌భాష‌లో రాణించ‌డ‌మే క‌ష్ట‌మైన రోజుల్లో ....ఏకంగా పాన్ ఇండియన్ వైడ్ త‌న పేరు మారుమ్రోగాల‌ని పెద్ద డ్రీమ్ తోనే ముందుకెళ్తున్న‌ట్లు రివీల్ చేసింది. అలాగే యాక్టింగ్ విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు లేవ‌ని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అందాలు విందుకు రెడీ అంటూ హింట్ ఇచ్చింది.

యాక్ష‌న్.. సూప‌ర్ నేచురల్ .. సైకో థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో పాటు...అవ‌సరం మేర గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించ‌డానికి సిద్దంగానే ఉన్నాను అనేసింది. ఐదేళ్ల‌లో పాన్ ఇండియ‌న్ హీరోయిన్ అవ్వాల‌ని..అది ఎలైగైనా ప‌ర్వాలి. కానీ క‌చ్చితంగా ఎద‌గాలి అన్న కాన్పిడెంట్ని వ్య‌క్తం చేసింది. నిజంగా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వాలంటే గ‌ట్స్ఉండాలి. అవ‌న్నీ ఫ‌రియాలో పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

ట్యాలెంటెడ్ బ్యూటీ ఏదైనా ఎచీవ్ చేయ‌గ‌ల స‌మ‌ర్ధురాలే అంటూ నెటి జ‌నులు  పొగిడేస్తున్నారు. మ‌రి చిట్టి ప్ర‌యాణం అంత వ‌ర‌కూ కొన‌సాగుతుందా?  లేదా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. ఇక హీరోయిన్ల మ‌ధ్య పోటీ గురించి చెప్పాల్సిన  ప‌నిలేదు. ఒక భాష‌లోనే  హీరోయిన్లు అవ‌కాశాల కోసం కుయుక్తులు ప‌న్నుతున్నారు. మ‌రోవైపు సీనియ‌ర్ భామ‌ల నుంచి పోటీ ఉండ‌నే ఉంటుంది. ఫ‌రియా వీట‌న్నింటిని దాటుకుని ముందుకెళ్తేనే తాను అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌దు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News