తెలుగు హీరోయిన్లకు బట్టలు ఇవ్వం

Update: 2018-03-01 23:30 GMT
టెక్నాలజీ ఎంత పెరిగినా సరే వివక్షపాత ధోరణి అనేది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంది. అది జాతి వివక్ష కావచ్చు, ప్రాంతీయ వివక్ష కావచ్చు, అది ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరి మీద చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అదే వివక్ష ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా ఉంది అంటే మీరు నమ్మగలరా?

ఈమధ్యనే ఒక పేరు మోసిన డిజైనర్ ఫాషన్ ఇండస్ట్రీ లో ఎప్పట్నిండో పెరుగుతూ వస్తున్న ప్రాంతీయ పక్షపాతం మీద గొంతెత్తారు. వాళ్ళ ధోరణికి విసుగు చెందిన ఆమె తన ఆవేదన ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కొన్ని పేరున్న బ్రాండ్స్ - సెలబ్రిటీస్ కి కాస్ట్యూమ్స్ ని సోర్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఈవెంట్స్ కి అయినా - సినిమా ఫంక్షన్లయినా వాళ్ళు హీరోయిన్లకు బట్టలను ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఈవెంట్ తరువాత వారు వాటిని తిరిగి ఇచ్చేయవలసి ఉంటుందన్న మాట. ఇలా ఒక డిజైనర్ ఒక సెలబ్రిటీ కోసం బట్టలు అడిగితే మేము తెలుగు తమిళ యాక్టర్లకి బట్టలు సోర్స్ చెయ్యం అంటూ మొహం మీద చెప్పేస్తారట. అంత పక్షపాతం చూపిస్తున్నప్పటికి వారు ఇదంతా మాములే గా అన్నట్టు ఉన్న ప్రవర్తన ఆమెను మరింత బాధించాయి.

ఒక బ్రాండ్ గా వారికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి వద్దు అని సెలెక్ట్ చేసుకునే రైట్ ఉంటుంది కానీ కేవలం ఈ బాషా యాక్టర్లకు మాత్రం ఇవ్వనే ఇవ్వం అనటం నిజంగా బాధాకరం. పైగా ఇందులో తప్పేం లేదు అన్నట్టు ఉన్న వారిని పొగరుబోతులు అనాలా లేదా ఏమనాలో నిజంగానే పాలుపోవట్లేదు. కాకపోతే అదే బ్రాండ్లు ఇక్కడ స్టోర్లు ఓపెన్ చేసుకుని.. సౌత్ లో బిజినెస్ మాత్రం చేసేసుకుంటున్నారు.
Tags:    

Similar News