బిబి4 : కళ్లు మిరుమిట్లు గొలిపిన ఫ్యాషన్ షో.. అమ్మాయిల అద్దంగా అవినాష్
నాల్గవ వారం చివరి రోజు ఎపిసోడ్ అయిన నిన్నటి ఎపిసోడ్ చాలా కలవ్ ఫుల్ గా కొనసాగింది. ఇంటి సభ్యులకు చందన బ్రదర్స్ వారి ఫ్యాషన్ షో నిర్వహించడం జరిగింది. ఈ ఫ్యాషన్ షో లో భాగంగా ఇంటి సభ్యులు అంతా కొత్త దుస్తులు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొనాల్సి ఉంటుంది. అంతకు ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా మెహబూబ్ ఇంటి సభ్యులకు డాన్స్ నేర్పించాడు. లాస్యతో వేయించిన చపాతి స్టెప్ లు ఆకట్టుకున్నాయి. ఇంటి సభ్యుల మ్యానరిజంలకు తగ్గట్లుగా మెహబూబ్ డాన్స్ కంపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన చందన బ్రదర్స్ ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది.
మొదట అబ్బాయిలు ర్యాంప్ వాక్ చేశారు. వచ్చిండే పాటకు వారు ర్యాంప్ పై చిన్న చిన్న స్టెప్పులు వేసి మెప్పించారు. ఆ తర్వాత అమ్మాయిలు రంగస్థలం సినిమాలోని ఎంత సక్కగున్నావే పాటతో ర్యాంప్ వాక్ చేశారు. మొదట గంగవ్వ ఈ వాకింగ్ ను మొదలు పెట్టారు. ఆమె పట్టు చీర కట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మోనాల్.. హారిక.. దివి.. స్వాతి ఇంకా అరియానాలు పిచ్చెక్కించారు. వారి కాస్ట్యూమ్స్ మరియు రొమాంటిక్ అప్పిల్ అదిరింది. వారు వేసిన స్టెప్పులు కూడా సూపర్బ్ గా అనిపించాయి. ఇక లాస్య మరియు సుజాతలు చాలా హోమ్లీగా ముద్దు వచ్చేలా ఉన్నారు. మొత్తానికి ఇంటి సభ్యులు అంతా కూడా తెలుగు వారి ఇంట్లో ఫంక్షన్ లేదా పండుగ అయితే ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యి ప్రేక్షకుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా చేశారు.
ఈ ఫ్యాషన్ షో విన్నర్ లను కూడా నిర్ణయించి లక్ష రూపాయల బహుమానం ను కూడా అందించారు. అమ్మాయిల తరపున ఎవరు బెస్ట్ అనేది అబ్బాయిలు డిసైడ్ చేశారు. అబ్బాయిలు అంతా కలిసి గంగవ్వకు బహుమానం ఇచ్చారు. ఇక అమ్మాయిలు అంతా కలిసి అబ్బాయిల్లో ఒకరుగా అవినాష్ ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత అందరిని లివింగ్ రూంలో కూర్చోబెట్టి అమ్మాయిలకు అవినాష్ అద్దంగా మారితే ఎలా ఉంటుంది అనేది చూపించాలంటూ బిగ్ బాస్ ఆదేశించారు.
ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిలు అవినాష్ ముందు కూర్చుని అద్దంగా తమను తాము చూసుకుంటున్నట్లుగా చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటే అవినాష్ వారికి కౌంటర్ ఇచ్చాడు. ఇది అంతా కూడా చాలా సరదాగా సాగింది. ఎపిసోడ్ చివర్లో సుజాత అలిగిన విషయం చర్చకు వచ్చింది. ఆమె అబ్బాయిల టీం విన్నర్ విషయంలో జరిగిన చర్చ మరియు అవినాష్ మొహంపై నీకు పేళ్లు వస్తున్నాయి అంటూ అవహేళన చేసినందుకు గాను ఫీల్ అయినట్లుగా ఇంటి సభ్యులు భావించారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ సరదాగా సందడిగా సాగిపోయింది.