హీరో వేణు మీద కేసు బుక్

Update: 2016-04-10 04:49 GMT
సెలెక్టివ్ గా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో వెండితెర మీద దర్శనం ఇవ్వని హీరో వేణు తొట్టెంపూడి తాజాగా ఒక కేసు విషయమై వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యింది. ఇంతకీ వేణు చేసిన నేరం ఏమిటన్నది చూస్తే.. కటువుగా వ్యవహరించటమేనన్న మాట వినిపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జేపీ రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబరు 302 హీరో వేణుది. ఆయన నుంచి ఫాతిమా బేగం అనే మహిళ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు.

ఈ సందర్భంగా రూ.88వేలను అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. ప్రతి నెలా రూ.29,300 చొప్పున అద్దెను చెల్లిస్తున్నారు. తాజాగా ఇంటిని ఆమె ఖాళీ చేస్తున్నట్లు ఫ్లాట్ యజమాని వేణుకు చెప్పారట. అయితే.. ఫ్లోర్ కి చిన్న బీటలున్నాయని.. వాటిని సరి చేసే వరకూ అడ్వాన్స్ ఇచ్చేది లేదంటూ వేణు మొండికేశాడట. ఆ మహిళ ఎంత చెప్పినా వినకపోవటంతో.. ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు.  పాతిమా నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హీరో వేణుపై కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News