వివాదాలంటే నాకు చాలా ఇష్టం అన్నట్లుగా ఉంటుంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యవహారం. తనను రియో ఒలింపిక్స్ కు అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై కాంట్రవర్సీ అంత తొందరగా తగ్గిపోయినందుకు చాలా బాధ పడుతున్నట్లు చెప్పిన ఒక్క రోజులోనే.. మరో వివాదంలో ఇరుక్కుపోయాడు. ఈ సారి సల్మాన్ తప్పుకి అతని తండ్రి సీనియర్ రైటర్ సలీమ్ ఖాన్ సారీ చెప్పాల్సి వచ్చింది.
సుల్తాన్ సినిమా కోసం ట్రైనింగ్ - షూటింగ్ లకు తాను కష్టపడ్డానన్న సల్మాన్ ఖాన్.. ఓ రోజు షూటింగ్ అయ్యే సరికి.. కదలడానికి కూడా కష్టంగా అనిపించిందని చెప్పాడు. అప్పుడు తన పరిస్థితి ఓ రేప్ చేయించుకున్న మహిళ బాపతుగా తయారైందంటూ వివాదానికి తెరతీశాడు. తప్పును వెంటనే గ్రహించి.. తన ఉద్దేశ్యం అది కాదంటూ.. తన కామెంట్ ని కవర్ చేసే యత్నం చేశాడు. అయితే వివాదం వెళ్లినంత తేలిగ్గా.. వివరణ జనాల్లోకి వెళ్లదు కదా. అందుకే తండ్రి సలీమ్ ఖాన్ వచ్చి సారీ చెప్పాల్సి వచ్చింది.
'సల్మాన్ అన్న మాటలు ఖచ్చితంగా తప్పే. ఉదాహరణ - చెప్పిన డీటైలింగ్ అంతా తప్పే. అయితే తను చెప్పిన ఉద్దేశ్యం తప్పు కాదు. అయినా సరే తను-తన కుటుంబం- ఫ్యాన్స్-ఫ్రెండ్స్ తరపున నేను సారీ చెబుతున్నాను. క్షమించడం కంటే పెద్ద మనసు మరింకేం ఉండదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా జరుపుకుంటున్న మహోన్నత క్షణాల్లో.. ఈ వివాదం అంతగా అనవసరం అనుకుంటున్నా' సలీమ్ ఖాన్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు.