దంగల్ కూతుళ్లు రెచ్చిపోతున్నారుగా!

Update: 2017-03-12 10:47 GMT
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ దంగల్.. ఎన్నేసి సంచలనాలు సృష్టించిందో ప్రత్యక్షంగా చూశారు అంతా. ఈ మూవీలో  ఆమీర్ ఖాన్ ఎంతగా ఆకట్టుకున్నాడో.. అతని కూతుళ్లుగా ఫాతిమా సనా షేక్.. సాన్యా మల్హోత్రాలు కూడా అంతగా మెప్పించారు. గీతా ఫొగట్.. బబితా ఫొగట్ లుగా వీళ్ల నటన అందరినీ మెప్పించింది.

ఆ సినిమాలో ఫాతిమా.. సాన్యా ఇద్దరివీ డీ గ్లామర్ రోల్స్ మాత్రమే. మూవీ రిలీజ్ తర్వాత కూడా కొన్ని వారాల పాటు పద్ధతిగా కనిపించిన వీరిద్దరూ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. గ్లామర్ షో విషయంలో కూడా కొంచెం కొంచెంగా గేట్లు ఎత్తేస్తున్నారు. తాజాగా జరిగిని జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో వీరద్దరే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. క్లీవేజ్ షో చేస్తూ ఓ భామ ఇరగదీస్తే.. స్కిన్ కలర్ డ్రస్ లో మరో వయ్యారి మెరిసిపోయింది.

బాలీవుడ్ లో అవకాశాలు అందాలంటే.. కెరీర్ గాడిలో పడాలంటే ఫేమ్ ఒక్కటే చాలదని.. గ్లామర్ డోస్ కూడా బాగా అవసరమనే విషయాన్ని తొందరగానే గ్రహించారు ఈ దంగల్ డాటర్స్. ఫేమ్ తో పాటు ఇప్పుడు గ్లామరసం కూడా చిందించేందుకు సై అనడంతో ఇంక అవకాశాలు రావడమే ఆలస్యం.. ఈ మల్లయోధురాళ్లు ఇరగదీసేయడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News