డిజె దెబ్బలకు ఫిదా ఆయింట్మెంట్

Update: 2017-07-29 05:49 GMT
ఆల్రెడీ 65+ కోట్లు షేర్ వచ్చిందని దిల్ రాజు అండ్ కో చెబుతున్నా కూడా.. అక్కడ రావల్సింది చాలా ఉంది. ఎందుకంటే దాదాపు 80 కోట్లకు ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమా ధియేట్రికల్ రైట్స్ ను విక్రయించారు కాబట్టి.. ఇప్పుడు ఖచ్చితంగా చాలామంది పంపిణీదారులకు స్వల్పంగా లాసులు అయితే వచ్చేసే ఉంటాయి. మరి వాటిని అలా వదిలేసి తన తదుపరి సినిమాను ఎక్కువ రేట్లకు వేరేవారికి అమ్ముకోవడానికి అక్కడుంది మామూలు నిర్మాత కాదు.. దిల్ రాజు. అందుకే ఆయన తానంటే ఏంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

నిజానికి డిజె సినిమా తాలూకు సగం లాస్ దిల్ రాజు ఖాతాలోనే ఉంటుంది. ఎందుకంటే నైజాంలో స్వయంగా ఆయనే రిలీజ్ చేసుకుంటే.. కొన్నిజిల్లాలో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. కాబట్టి తక్కిన ఆ పంపిణీదారులకు లాస్ రాకుండా ఇప్పుడు ''ఫిదా'' సినిమా రూపంలో రాజు మ్యాజిక్ చేశాడట. డిజె కొట్టిన దెబ్బలకు ఫిదా ఆయింట్మెంట్ ఓ రేంజులోనే రాస్తోంది. ఎందుకంటే 18 కోట్ల రూపాయలకు ధియేట్రికల్ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు తొలి వారంలోనే ఏకంగా 23 కోట్లు షుమారు షేర్ తెచ్చేసింది. ఆగస్టు 11 వరకు వేరే పెద్ద సినిమాలేవీ పోటీ లేవు కాబట్టి.. ఇంకో రెండు వారాలు దున్నుకునే ఛాన్సుంటుంది. కాబట్టి ఈ సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేయడమే కాకుండా.. డిజె ద్వారా పోగొట్టుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈజీగానే రికవర్ అయిపోతాయి. మొత్తానికి దిల్ రాజు భలే బ్యాలెన్స్ చేశాడులే అంటున్నారు పంపిణీదారులు.

ఇక ఓవర్సీస్ లో కూడా డిజె ఎవరైతే కొన్నారో వారికే ఫిదా సినిమాను కూడా ఇచ్చారు. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో కంటే అమెరికాలోనే డిజె సినిమా ఎక్కువ లాసును తెచ్చింది. కాబట్టి అక్కడ అల్లు అర్జున్ మిగిల్చిన లోటును ఇప్పుడు వరుణ్ తేజ్ బర్తీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు.


Tags:    

Similar News