ఒక సినిమా స్టామినా ఏంటనేది ఎవ్వరూ కూడా ఎగ్జాట్ గా చెప్పలేరు. జనాలకు ఎప్పుడు ఏ సినిమా ఎలా ఎక్కుతుందో చెప్పే మనుషులు మిషన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒక్కోసారి మనం కలక్షన్లను చూస్తే మాత్రం.. అసలు ఈ సినిమా ఇలా ఆడుతుందో అంటూ షాకైపోవాలి. హైదరాబాదులోని మాస్ సెంటర్లగా ప్రఖ్యాత గాంచిన ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో కొన్ని ధియేటర్లు ఉన్నాయి. సుదర్శన్.. దేవి.. సంధ్య.. మయూరి.. సప్తగిరి.. శాంతి.. అక్కడ బాగా ఫేమస్. వాటిలో కేవలం మంగళవారం సాయంత్రం మొదటి ఆటకు వచ్చిన కలక్షన్లను చూస్తే మాత్రం స్టన్ అవ్వాల్సిందే.
అత్యధికంగా ఆనందో బ్రహ్మ సినిమాకు 45 వేల షుమారు కలక్షన్ వస్తే.. ఆ ప్రక్కనే మిగతా ధియేటర్లలో ఆడుతున్న జయ జానకి నాయక సినిమాకు 28 వేల రూపాయలు వసూలు వస్తే.. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు 26 వేల రూపాయల టిక్కెట్లు తెగాయ్. ఇక లై సినిమాకు 11 వేల రూపాయలు వస్తే.. నిన్ను కోరి సినిమాకు 4 వేలు వచ్చాయి. కాని షాకింగ్ ఏంటంటే.. ఆనందో బ్రహ్మ సినిమా మొదటి ప్లేసులో ఉంటే.. రెండో ప్లేసులో మాత్రం ఫిదా సినిమాకు ఏకంగా 34 వేల రూపాయల కలక్షన్ వచ్చింది. అంటే హైదరాబాద్ మాస్ లో తెలంగాణ స్లాంగులో నిజామాబాద్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాకు ఆదరణ ఇంకా తగ్గలేదనమాట.
ఇకపోతే క్రాస్ రోడ్స్ ధియేటర్లలో పరిస్థితి ఎలా ఉన్నా కూడా.. ఓవరాల్ గా ఫిదా బాగా ప్రాఫిటబుల్ సినిమా అవగా.. నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా లాభాలను అర్జించింది. జయ జానకి నాయక సినిమాకు బ్రేకీవన్ రావల్సి ఉండగా.. లై సినిమాకు భారీ నష్టాలు తప్పవు. అది సంగతి.