సౌత్ ఇండియన్ సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్లకు పీటర్ హెయిన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. సౌత్ లో అనేకానేక భారీ సినిమాలకు అతను పని చేశాడు. శంకర్.. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్లకు అతను ఫేవరెట్. మగధీర.. బాహుబలి.. శివాజీ.. రోబో లాంటి సినిమాలకు అతను యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇండియాలో నెంబర్ వన్ స్టంట్ మాస్టర్ అతనే అనడంలో సందేహం లేదు. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పీటర్ హెయిన్ తాజాగా ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఇండియాలోని నాలుగు ప్రముఖ సినీ పరిశ్రమల్లో తొలి 100 కోట్ల సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన స్టంట్ మాస్టర్ గా అరుదైన రికార్డు సాధించాడు పీటర్ హెయిన్. తెలుగులో తొలి 100 కోట్ల గ్రాస్ మూవీ ‘మగధీర’కు అతనే యాక్షన్ కొరియోగ్రాఫర్. శంకర్ దర్శకత్వం వహించిన తొలి తమిళ వంద కోట్ల మూవీ ‘శివాజీ’కి కూడా అతనే స్టంట్స్ సమకూర్చాడు. వీటి కంటే ముందు తొలి ఇండియన్ 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ ‘గజిని’కి కూడా పీటర్ పని చేశాడు. తాజాగా తొలి 100 కోట్ల మలయాళ మూవీగా చరిత్రకెక్కిన ‘పులి మురుగన్’ కూడా పీటర్ హెయిన్ ఖాతాలోకే పడింది. అతను ఆ సినిమాకు ఫైట్లు కంపోజ్ చేశాడు. మొత్తానికి నాలుగు ఇండస్ట్రీల్లో తొలి 100 కోట్ల సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ పీటరే చేయడం అరుదైన విషయం.