ఇప్పుడప్పుడే సినిమాల విడుదల ఉండకపోవచ్చు...!

Update: 2020-10-06 17:31 GMT
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ ఏడు నెలలుగా థియేటర్స్ మూతబడిపోయాయి.. సినిమాల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్స్ ప్రారంభం అవుతుండటంతో కళ తప్పిన సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇన్నాళ్లు మహమ్మారికి భయపడి ఇంటికే పరిమితమైన స్టార్ హీరోలు సైతం ఒక్కొక్కరుగా సెట్‌ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ స్కేల్ మూవీస్ కూడా చిత్రీకరణ స్టార్ట్ చేసేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇండోర్ షూటింగ్స్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చినప్పటికీ.. రీసెంటుగా ఫారిన్ షెడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీనికి తోడు అక్టోబర్ 15 నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో సినీ ఇండస్ట్రీ నెమ్మదిగా నార్మల్ సిచ్యుయేషన్ కి వస్తోందని చెప్పవచ్చు.

అయితే థియేటర్స్ తెరవడానికి పర్మిషన్స్ వచ్చినా ఇప్పుడప్పుడే సినిమాలు రిలీజ్ చేయకపోవచ్చని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా బాగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. థియేటర్స్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా వారికి అదనపు భారంగా మారనుంది. జనాలు కరోనాకి ఎంత అలవాటు పడినప్పటికీ లైఫ్ రిస్క్ చేసి ఆడియన్ సినిమా చూడటానికి వస్తాడా అనేది ప్రశార్థకమే. ఇక 50శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో సినిమా విడుదల చేస్తే పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అని కొందరు ఫిలిం మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటికప్పుడే హడావిడిగా సినిమాలను థియేటర్స్ లోకి తీసుకురాకపోవచ్చు అని అంటున్నారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత అన్నీ సెట్ అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News