ఇండస్ర్టీలో అవకాశం గగనం. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే వచ్చిన ఆ ఛాన్స్ కూడా చేజారే ప్రమాదముంటుంది. ఎంతటి ప్రతిభావంతులైనా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నవారే. ఆ స్టేజ్ దాటొచ్చిన తర్వాత రిలయలైజ్ అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అనుభవజ్ఞలు చెబుతుంటారు.
వీటిని పరిశ్రమలో పాఠలుగా భావించిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా యంగ్ మేకర్ బుచ్చిబాబు సాన...హరీష్ శంకర్ శైలి అదే సన్నివేశాన్ని గుర్తు చేస్తుందంటున్నారు కొందరు. ఇద్దరు భీష్మించి కూర్చుని వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుంటూ వాళ్లిద్దరు కోసం సమయాన్ని వృద్ధా చేసుకుంటున్నారని విమర్శలు తె రపైకి వస్తున్నాయి.
తొలి సినిమా 'ఉప్పెన' తో బుచ్చి బాబు భారీ సక్సెస్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ట్యాలెంటెడ్ మేకర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇంత వరకూ రెండవ సినిమా ప్రారంభించింది లేదు. ఉప్పెన రిలీజ్ అయిన ఏడాదిన్నర కావొస్తుంది. కానీ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న చందంగా ఎన్టీఆర్ డేట్లు కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు.
టైర్ -2 హీరోలు పలువురు సినిమా చేయమని ఆఫర్ చేసినా తగ్గేదలే అంటూ వాటిని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో సినిమా లాంచ్ చేయాలి? ఆ తర్వాతనే ఏస్టార్ అయినా అంటూ తారక్ జపం చేస్తున్నాడు. టైగర్ తో సినిమా చేయాలంటే ఇంకా అతను ఏడాది పాటు వెయిట్ చేయక తప్పదు. కొరాటాల శివ సినిమా పూర్తి చేస్తే గానీ తారక్ బుచ్చిబాబుకి టచ్ లో కి రాడు.
అలాగే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం మూడేళ్ల నుంచి అతని చుట్టూనే తిరుగుతున్నాడు. చివరికి ఎలాగూ భవదీయడు భగత్ సింగ్ టైటిల్ ప్రకటించే వరకూ వచ్చింది. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. మరికొన్ని నెలలు గడిస్తే పవన్ పూర్తిగా రాజకీయ ప్రచారంలో బిజీ అవుతారు. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలైపోతుంది.
అదే జరిగితే 2024 ఎన్నికలు పూర్తయ్యే వరకూ హరీష్ వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే కొంత మంది హీరోలు ఛాన్సులు ఇచ్చినా హరీష్ వాటిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే బుచ్చిబాబు..హరీష్ లో కామన్ గా కనిపించిన లక్షణం ఏంటంటే? ఇద్దరు మొండొళ్లులాగే భీష్మించుకుని కూర్చోవడం. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు...పవన్ కోసం హరీష్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం ఓ రకంగా మెచ్చుకోవాల్సిందే. మొండి పట్టుద లేకపోతే ఇంత కాలం వెయిట్ చేయలేరు. అందుకు ఎంతో ఓపిక..సహనం ఉండాలి. అవన్నీ ఇద్దరిలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు చెరో రెండు సినిమాలు చేసే అవకాశం ఉన్న చేయలేదు. ఆ రకంగా కొంత నష్టమైతే జరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.