బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మూవీలో సౌత్‌ స్టార్స్‌?

Update: 2019-09-14 16:11 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ గత ఏడాది 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత అమీర్‌ ఖాన్‌ ఫ్లాప్‌ ను చవిచూశాడు. దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుని తదుపరి చిత్రంను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈయన హాలీవుడ్‌ మూవీ 'పారెస్ట్‌ గంప్‌'ను 'లాల్‌ సింగ్‌ చద్దా' అనే టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం అమీర్‌ ఖాన్‌ తన లుక్‌ ను పూర్తిగా మార్చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు తమిళ స్టార్స్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు తమిళ హీరో విజయ్‌ సేతుపతిని కీలక పాత్ర కోసం 'లాల్‌ సింగ్‌ చద్దా' యూనిట్‌ సభ్యులు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండనే ఇప్పుడు అదే సినిమాలోని కీలక పాత్ర కోసం తమిళ స్టార్‌ కమెడియన్‌ యోగి బాబును ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'పారెస్ట్‌ గంప్‌' చిత్రంలో కీలకమైన బుబ్బా అనే పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం కూడా ఆ పాత్ర హాస్యంను పంచడంతో పాటు క్లైమాక్స్‌ లో ప్రేక్షకులు చాలా ఎమోషనల్‌ అయ్యేలా చేస్తుంది.

బుబ్బా పాత్రకు యోగి బాబు అయితేనే సూపర్బ్‌ గా సెట్‌ అవుతాడు అంటూ యూనిట్‌ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌.. బిజీ కమెడియన్‌ యోగి బాబు. ఒకేసారి ఈయన డజను సినిమాల్లో నటిస్తున్నాడు. అదే సమయంలో హీరోగా కూడా సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' చిత్రంలో నటించేందుకు యోగి బాబుకు వీలు పడుతుందా అనేది చూడాలి.

అమీర్‌ ఖాన్‌ వంటి సూపర్‌ స్టార్‌ మూవీలో నటించే అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం. మరి యోగి బాబు ఆ అవకాశంను సద్వినియోగం చేసుకుంటాడా లేదంటే బిజీ కారణంగా వదిలేస్తాడా అనేది చూడాలి. విజయ్‌ సేతుపతి మరియు యోగి బాబులు 'లాల్‌ సింగ్‌ చద్దా' చిత్రంలో నటిస్తున్నారనే విషయమై యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే వరకు సోషల్‌ మీడియాలో ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది.

Tags:    

Similar News