వరుసగా భారీ సినిమాలను చేసిన ఒక స్టూడియో పరిస్థితి ఏంటంటే.. మీకు వెంటనే ఒక ప్రొడక్షన్ స్టూడియో గుర్తొచ్చేసిందా? అబ్బే కాదులే. అలాంటి స్టూడియోలన్నీ చక్కగా ఫ్రీగా వచ్చిన భూములను ఇప్పుడు భారీ రేట్లకు అమ్మేసుకుని బాగానే ఉంటున్నాయ్. కాని మనం మాట్లాడుతోంది మాత్రం ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో. ఇప్పుడు ఆ స్టూడియో గురించి ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది.
మన దేశంలో వచ్చిన ఒక అతి పెద్ద సినిమాకు సదరు స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. దర్శకుడు అడిగినంత క్రియేటివిటీ.. దానికి కావల్సిని టెక్నికల్ ప్రావిణ్యాన్ని విదేశాల నుండి కూడా సమకూర్చుకుని మరీ వీరు సదరు సినిమా ఔట్పుట్ అద్భుతంగా రావడంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. అయితే అదంతా గతం. సదరు సినిమా పనంతా పూర్తయిపోయి ఆర్నెలలు అయ్యింది. ఇప్పుడు ఈ స్టూడియోలో అసలు ఏ సినిమా వర్క్ జరుగుతుందా అని చూస్తే.. అక్కడ ఎంప్లాయిస్ అందరూ ఖాళీయే. ఎందుకంటే వీరు ఆ పెద్ద సినిమా చేస్తున్నారు కాబట్టి.. అప్పట్లో వీరికి ఇతర పెద్దసినిమాల వర్కులు ఒప్పుకునే సౌలభ్యం లేకుండా పోయిందట. ఇప్పుడు ఆ సినిమా వర్క్ అయిపోయాక వీరు కొత్తవి ఒప్పుకుందాం అంటే.. అమ్మో ఆ రేంజు క్వాలిటీ వర్క్ చేసేవారు మన దగ్గర ఎంత ఎక్కువ గుంజేస్తారో అని ఈ సినిమాలోళ్ళు వెళ్ళట్లేదు.
మొత్తంగా ఈ కంపెనీ ఉద్యోగులు అందరూ రోజూ ఇంటర్నెట్ లో వీడియో చూసుకోవడం.. నెలకోసారి జీతం తీసుకోవడం తప్పించి.. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. దీని దెబ్బతో స్టూడియో ఓనర్లకు కాస్త భయంగా ఉందట. చూద్దాం మరి వీరు త్వరలో ఇంకోటేదైనా పెద్ద సినిమాను ఒప్పుకుంటారేమో.