'ఆదిపురుష్' సీత‌ ఫిలింఫేర్ ఉత్త‌మ న‌టి!

Update: 2022-09-01 02:30 GMT
67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్  కార్య‌క్ర‌మం ముంబైలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ 83 మూవీలో న‌ట‌న‌కు గాను ఉత్తమ నటుడు (పురుషుడు) అవార్డును గెలుచుకోగా.. ఆదిపురుష్ ఫేం కృతి సనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. `మిమీ` చిత్రంలో న‌ట‌న‌కు గాను కృతికి ఈ అవార్డు ద‌క్కింది.

మంగళవారం రాత్రి `బ్లాక్ లేడీ`(అవార్డును) అందుకున్న కృతి ఎమోష‌న‌ల్ గా క‌నిపించింది. రణ్ వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనేతో కలిసి ఇదే వేదికను పంచుకున్నాడు.

ఫిలింఫేర్ కంటే ముందు ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM) 2022లో 83లో తన నటనకు రణవీర్ సింగ్ కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. కబీర్ ఖాన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజయం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ వరల్డ్ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ గా కనిపించాడు.

కృతి సనన్ గురించి ప్ర‌స్థావిస్తే... 2021లో విడుదలైన `మిమి`లో కృతి ఎంతో అద్భుతంగా న‌టించింది. అందుకే త‌న‌ నటనకు గౌరవం లభించింది. మిమి లో కృతి సనన్ అద్దె తల్లి పాత్రలో నటించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.

ఇక కృతి స‌నోన్ త‌దుప‌రి ప్ర‌భాస్ తో క‌లిసి ఆదిపురుష్ 3డిలో న‌టిస్తోంది. ఓంరౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2023 లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా .. కృతి సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తోంది. నిజానికి ఇది కూడా అవార్డ్ రేంజ్ ఆఫ‌ర్. కృతి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి వ‌చ్చే ఏడాది మ‌రో ఫిలింఫేర్ కొల్ల‌గొడుతుందేమో చూడాలి.

విక్కీ కౌశల్- అసీస్ కౌర్- బి ప్రాక్- విద్యాబాలన్- విష్ణువర్ధన్ .. పంకజ్ త్రిపాఠి వంటి ప్రముఖులు కూడా 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News