మెగాస్టార్ భార్య సెన్షేషనల్ కామెంట్స్!

Update: 2016-10-26 05:50 GMT
సినిమాల గురించి సినిమాలను బయటనుంచి చూసేవారికి ఒక అభిప్రాయం ఉంటే... అక్కడే ఉండే వారికి మరో అభిప్రాయం ఉంటుంది. వీరిలో కాస్త గత జనరేషన్ కు సంబందించిన వారైతే ఇంక చెప్పేదేముంది. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రస్తుతం ఇండస్ట్రీ అవలంబిస్తోన్న పోకడలు వారికి ఏమాత్రం అర్ధంకాకపోవచ్చనే అనుకోవాలి!! ఈ విషయంలో ఈ బిజినెస్, ఫిల్మ్ మేకింగ్, కలెక్షన్లూ రికార్డులూ ఇవన్నీ తనకు ఎప్పటికీ అర్ధంకావని చెబుత్న్నారు బాలీవుడ్ సీనియర్ నటి, మెగాస్టార్ అమితాబ్ సతీమణి జయ బచ్చన్.

ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్ (మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. "ఈ రోజుల్లో సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది.. మానవత్వం - సున్నితత్వం మచ్చుకైనా కనపడవు సరికదా తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పాత్రల్లో మచ్చుకైనా భారతీయత కనిపించడంలేదు.. సినిమాల వల్ల జనం కూడా కఠినంగా మారిపోతున్నారు" అని అన్నారు. ఇదే సమయంలో ఇంకాస్త డొసు పెంచిన జయ బచ్చన్... ప్రస్తుత సినీ పరిస్థితులపై ఇంకా గట్టిగా చెప్పాలంటే... సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు అని అనేశారు.

ఈ సందర్భంగా 50వ - 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. జనజీవితాలను ప్రతిబించించే కొన్ని సినిమాలు మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని - మసాన్ - అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు. ఈ క్రమాంలో నేటి ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ వ్యవహారాలపై కూడా జయ స్పందించారు. "మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు - లేకపోతే తొలిరోజు - తొలివారం రికార్డులు.. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు.. అందుకే నేను అలాంటి చోట ఉండలేను" అని జయ బచ్చన్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News