డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ విడుదల ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వాయిదా పడింది. సరే ఫస్ట్ వేవ్ తర్వాత అయినా ఈ ఏడాదిలో విడుదల చేస్తారనుకుంటే వచ్చే ఏడాదికి సినిమా వాయిదా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లైగర్ సినిమాను ఎప్పటికి విడుదల చేస్తారు అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ విషయమై రేపు ఒక స్పష్టత ఇచ్చేలా కనిపిస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యులు రేపు లైగర్ ప్రామీస్ నిలబెట్టుకోబోతున్నాడు అంటూ ప్రకటించారు. సినిమా షూటింగ్ ఎంత వరకు అయ్యింది.. విడుదల ఎప్పుడు.. టీజర్ ఎప్పుడు వీటన్నింటికి ఒక సమాధానం లభిస్తుందేమో అంటూ విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లైగర్ చేయబోతున్న ప్రామీస్ ఏమై ఉంటుంది.. అసలు లైగర్ కాన్సెప్ట్ ఏంటీ అనేది ఆసక్తికర విషయం. ప్రస్తుతం సినిమా షూటింగ్ విషయంలో నెలకొని ఉన్న సస్పెన్స్ కు తెర దించడం ఖాయంగా కనిపిస్తుంది.
లైగర్ సినిమా రేపటి అప్డేట్ ఏంటీ అసలు లైగర్ నుండి వచ్చేది ఏంటీ అనేది తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ దేవరకొండ గత కొన్నాళ్లుగా లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన మరో సినిమాను మొదలు పెట్టకుండా వెయిట్ చేస్తున్నాడు. ఆయన హెయిర్ స్టైల్ కేవలం లైగర్ కోసం మెయింటెన్ చేస్తున్నాడు. కనుక లైగర్ ను ముగించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు లైగర్ షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే రోజులు దగ్గరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. లైగర్ సందడి రేపటి నుండి మామూలుగా ఉండదు అంటూ అభిమానులు ఆసక్తిగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.