మొత్తానికి ఆమెతో పెళ్లిపై కుర్ర‌హీరో ఏమ‌న్నాడంటే?

Update: 2020-07-06 10:50 GMT
మ‌లైకా అరోరా -అర్జున్ కపూర్ బంధం గురించి తెలిసిందే. విదేశాల్లో నూతన సంవత్సర వేడుకల్లో ఈ జంట ఓపెనైన త‌ర్వాత మీడియాలో ఆ ఇద్ద‌రూ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత జోరు గా జంట‌ షికార్లు స‌హా రొమాంటిక్ డిన్నర్ డేట్ల గురించి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే పెళ్లి గురించి మీడియా ప‌దే ప‌దే మ‌లైకా- అర్జున్ ఇద్ద‌రినీ ప్ర‌శ్నించింది.

మలైకాను వివాహ మాడుతున్నారా? అన్న ప్ర‌శ్న‌కు అర్జున్ తన ఆలోచన ఏమిటో చెప్పారు. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోబోనని చెప్పి సందేహాన్ని క్లియ‌ర్ చేశాడు. సాధారణంగా పురుషులు పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహాల్ని కోల్పోతారు. పెళ్లికి ముందు కాదు అంటే న‌వ్వేశాడు అర్జున్‌. నా వ్యక్తిగత జీవితం లో గౌరవానికి అర్హుడని నేను భావిస్తున్నాను అంటూ క‌ట్ చేశాడు. నా వ్యక్తిగత.. వృత్తిపరమైన జీవితాలు రాత్రి బాగా నిద్రపోవడానికి నాకు సహాయ పడతాయి. అది అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

మలైకాను పెళ్లి గురించి ప్ర‌శ్నిస్తే ఇంచుమించు ఇలాంటి స‌మాధాన‌మే వ‌చ్చింది. ``మేము ఒక మంచి సమయం లో ఒక అడుగు ముందుకు వేస్తాం. వివాహం విషయానికొస్తే.. ఇవి మీరు ఊహించ‌ గ‌లిగే సింపుల్ విషయాలు కాదు. టైమ్ కావాలి`` అని తెలిపారు. మలైకా - అర్జున్ పెళ్లి చేసుకోవడం అనే టాపిక్ నే క‌ట్ చేస్తున్నా.. లవ్‌బర్డ్స్ ఎప్పుడు ఏం చెబుతారోన‌న్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది. అందుకే ప‌దే ప‌దే అదే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. మ‌రి 2020 లాక్ డౌన్ స‌మ‌యం లో అయినా వీళ్ల‌ లో మార్పు వ‌చ్చిందో లేదో.. ఏమిటో!!
Tags:    

Similar News