ఫైన‌ల్లీ కియరా- సిధ్ పెళ్లి తేదీ ఫిక్స్

Update: 2022-12-31 03:35 GMT
సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ప్రేమాయ‌ణంపై ఏడాది కాలంగా ఎడ‌తెరిపిలేని క‌థ‌నాలొస్తున్నాయి. ముంబై మీడియా ఈ జంట‌ను వెంటాడి వేటాడుతోంది. ప‌బ్లిక్ లో చాలాసార్లు విసిగించింది కూడా. కలిసి జంట‌గా షికార్లు చేసినా లేదా విడివిడిగా విహార యాత్ర‌ల‌కు వెళ్లినా ఆ ఇద్ద‌రినీ జ‌త‌గా చూసేందుకే ముంబై మీడియా ఆసక్తిని క‌న‌బ‌రిచింది. ఈ జంట‌ను ఎలా క‌ల‌పాలి?  అని ఆత్ర‌ప‌డిన మీడియా త‌ప‌నే వేరే లెవ‌ల్.

ఈ అంద‌మైన జంట పెళ్లి గురించిన ముచ్చటా ఇప్పుడు బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ జంట కొన్ని అందమైన క‌పుల్ గోల్స్ తో త‌మ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. వీటిని అభిమానులంతా అనుసరిస్తున్నారు. ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో ఈ జంట చేస్తున్న సంద‌డి అభిమానుల దృష్టిని విప‌రీతంగా ఆకర్షిస్తోంది.

సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ బాలీవుడ్ లో అత్యంత అందమైన జంటలలో ఒకరు. ప‌ర్ఫెక్ట్ క‌పుల్ గా అభిమానులు ఈ జోడీని చూస్తున్నారు. ఈ జంట పెళ్లికి సంబంధించిన‌ ప్రతి చిన్న‌ వివరం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు పెళ్లి తేదీ ఫిక్స‌యింది. `షేర్ షా` జోడి సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీలు ఫిబ్రవరి నెలలో పెళ్లికి సిద్ధంగా ఉన్నారని.. 6 ఫిబ్రవరి 2023 తేదీని వెడ్ లాక్ చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ అంద‌మైన జంట‌ అభిమానులందరికీ ఆనందాన్నిచ్చే ఘ‌డియ ఇది. బాలీవుడ్ లో మరో గ్రాండ్ వెడ్డింగ్ కు స‌మ‌య‌మాస‌న్న‌మైన‌ట్టే.

కియ‌రా త‌దుప‌రి ఆర్.సి 15లో క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ చిత్రం తెర‌కెక్కుతోంది. మ‌రోవైపు ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో కియ‌రా పెళ్లికి స‌మ‌యం ఎంతో దూరంలో లేద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు సిద్ధార్థ్ న‌టించిన మిష‌న్ మ‌జ్ను నెట్ ఫ్లిక్స్ లో అల‌రించేందుకు వ‌స్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 19న‌ ఈ చిత్రం ప్రీమియ‌ర్ కి రెడీ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News