ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గల ప్రఖ్యాత రాజ్ కపూర్ (ఆర్కే) ఫిల్మ్ స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియోలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్టూడియోలోని హాల్ నెం.1 పూర్తిగా ధ్వంసమైంది. సూపర్ డ్యాన్సర్ టీవీ షో సెట్ కోసం ఎలక్ట్రిక్ వైర్లను ఏర్పాటు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి చేరుకున్న ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు సెట్లో షూటింగ్ లేకపోవడం వల్ల ఆ షోకు సంబంధించిన వారెవరూ సెట్లో లేరు. దీంతో, పెను ప్రమాదం తప్పింది.
అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా స్టూడియోలో ఉన్న వారిని బయటకు పంపించి వేశారు. ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందినట్టు కాని, గాయపడినట్టు కాని ఇంకా సమాచారం లేదు. ఎలక్ట్రికల్ వింగ్ లో లెవల్ -2 మంటలు వ్యాపించాయని, అందువల్ల ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తతానికి పరిస్థితి అదుపులోనే ఉందని రిషి కపూర్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ 1948లో ఈ స్టూడియోను స్థాపించారు. ప్రస్తుతం హీరో రిషీ కపూర్ స్టూడియో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.