కరోనా దెబ్బకి కలవరిపడిన టాలీవుడ్

Update: 2020-03-23 07:20 GMT
దశాబ్దాల చరిత్రని కలిగియున్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి వల్ల విలవిల్లాడిపోతున్నది. కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి వలన సినీ పరిశ్రమ కొన్ని వేల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు, థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యిందని చెప్పవచ్చు. తెలుగులో మాత్రం సినిమాల నిర్మాణం 83 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినీ పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. ఇంత ఘన చరిత్ర కలిగిన టాలీవుడ్ కరోనా కొట్టిన దెబ్బకి ఇప్పట్లో కోలుకొనే పరిస్థితులు కనిపించడం లేదు.

హుద్ హుద్, లైలా తుపాన్ లాంటి ప్రకృతి విపత్తులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న టాలీవుడ్ కరోనా వైరస్ కి భయపడిపోయింది. ఇప్పటి దాకా టాలీవుడ్ ఒక నెల వ్యవధిలో ఒక్క చిత్రం కూడా విడుదలకు నోచుకోలేదు. మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి దాకా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. సినిమా రంగంలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ మూతపడిన సందర్భం ఇదే. కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల మంది కార్మికుల జీవితాలలో కరోనా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ప్రాలదోలడానికి టాలీవుడ్ మొత్తం ఏకతాటిపై వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు టాలీవుడ్ తమ మద్దతు తెలిపి తమ ఐక్యతను చాటుకున్నారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఇలాంటి వైరస్ బారి నుండి త్వరగా బయటపడి సినీ పరిశ్రమ పూర్వ వైభవాన్ని పొందాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News