ఒకప్పుడు దెయ్యం సినిమాలు అరుదుగా అది కూడా ఎక్కువగా హాలీవుడ్ నుంచి వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. లారెన్స్ లాంటి దర్శకుల పుణ్యమా అని దెయ్యాలకు జనం భయపడటం లేదు. సరదాగా నవ్వుకుంటున్నారు. నిజంగా సీరియస్ గా చూపించినా అదో మాములు వ్యవహారం అయిపోయింది. సరే రాను రాను ఈ జానర్ రొటీన్ గా మారుతోందని గుర్తించిన దర్శక నిర్మాతలు ఇందులో కూడా కొత్త పంధాను వెతుకుతున్నారు.
ఇండియాలో మొదటి సారి త్రీడిలో దెయ్యం సినిమా రాబోతోంది. లీసా టైటిల్ తో కొత్త దర్శకుడు రాజు విశ్వనాథ్ రూపొందిస్తున్న ఈ మూవీలో అంజలి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇది వచ్చే నెల అంటే మే 24 రిలీజ్ డేట్ ని లాక్ చేస్తూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తెలుగు తమిళ్ బాషలలో ఒకేసారి ఇది రిలీజ్ కానుంది. త్రీడి ఎఫ్ఫెక్ట్స్ లో దెయ్యాన్ని చూడటం అంటే అది ఖచ్చితంగా ప్రత్యేకంగానే ఉంటుంది.
కళ్ళద్దాల వైపు దెయ్యం అలా మనవైపుకు వస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మనకు కొత్త కాని ఇంగ్లీష్ లో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ మధ్య ఇదే తరహాలో ఇంకో తమిళ సినిమా త్రీడి చేసే ప్రయత్నం చేశారు కాని అది సినిమా మొత్తం ఎఫెక్ట్స్ ఉన్న మూవీ కాదు. లీసా మాత్రం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా మొత్తం త్రీడి వెర్షన్ లోనే రూపొందుతుందట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు-గీతాంజలి ద్వారా చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన తెలుగమ్మాయి అంజలి మొత్తానికి ఇక్కడ కాకపొయినా తమిళ్ లో బాగానే ఆఫర్లు రాబడుతోంది