తెలుగు ఓటీటీ ఆహా విస్తరణ శరవేగంగా జరుగుతోంది. రెండేళ్ల క్రితం కేవలం ఒక్క తెలుగు భాషకు పరిమితం అయ్యి చిన్న సినిమాలు.. చిన్న చిన్న వెబ్ సిరీస్ లను తీసుకు వచ్చిన ఆహా ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరణకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు తెలుగు లో మాత్రమే కంటెంట్ ను అందిస్తున్న ఆహా ఇతర భాషలకు విస్తరించేందుకు సిద్దం అయ్యింది.
ఇదే సమయంలో ఆహా వారం సొంతంగా కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు గాను ఆహా స్టూడియోను ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాదికి చెందిన ప్రముఖులతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి ఆహా స్టూడియో భాగస్వామ్యంలో పెద్ద ఎత్తున ఓటీటీ కంటెంట్ ను తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అల్లు అరవింద్ ప్రకటించారు.
ఆహా స్టూడియోలో మొదటగా స్వర్గీయ లెజెండ్రీ తెలుగు ప్రధాన పీ వీ నరసింహారావు జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆహా ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా పీవీ నరసింహా రావు జీవిత చరిత్రను వెబ్ సిరీస్ ద్వారా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా నా వెబ్ సిరీస్ చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు.
కాని ఇలాంటి ఒక లెజెండ్ గురించి ఓటీటీ లో చూపించాలి అంటే వెబ్ సిరీస్ అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇండియన్ లాంగ్వేజ్ ల్లో అన్నింట కూడా పీవీ బయోపిక్ ను తీస్తారని తెలుస్తోంది.
ఆహా స్టూడియో ద్వారా ముందు ముందు భారీ పాన్ ఇండియా సినిమాలు.. వెబ్ సిరీస్ లు వస్తాయని మేకర్స్ చెబుతున్నారు. కేవలం ఓటీటీ కంటెంట్ మాత్రమే కాకుండా థియేటర్ మూవీస్ కూడా వీరు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తానికి ఆహా స్టూడియో ఏర్పాటుతో ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ మరియు మంచి కంటెంట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా స్టూడియో ద్వారా ముందు ముందు రాబోతున్న కంటెంట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అరవింద్ ఆహా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.