టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమా ల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధికంగా సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ గానే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా ఈ అమ్మడు నిలిచింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో సుల్తాన్ తో ఎంట్రీ ఇచ్చి అక్కడ నుండి ఆఫర్లు దక్కించుకుంటుంది. బాలీవుడ్ లో రెండు సినిమా ల్లో నటిస్తుంది. ఇక తన మాతృ పరిశ్రమ అయిన కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఈమె సినిమాలు చేస్తూ ఉంది.
ఈ కరోనా సమయంలో కూడ బిజీ బిజీగా షూటింగ్ ల్లో పాల్గొన్న రష్మిక మందన్నా ఇటీవల ఒక చిట్ చాట్ లో తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ తన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ అంటూ చెప్పుకొచ్చింది. కన్నడంలో రూపొందిన కిర్రాక్ పార్టీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రష్మిక ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా సక్సెస్ వల్లే తెలుగులో ఛలో సినిమా లో ఈమెకు ఆఫర్ దక్కిందనే విషయం కూడా తెల్సిందే. ఛలో మరియు గీత గోవిందం సినిమా లతో టాలీవుడ్ లో రష్మిక పాతుకు పోయింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా లో నటిస్తుంది. అయినా కూడా ఈమెకు తెలుగు సినిమా ల కంటే తాను మొదట నటించిన కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ అంటేనే ఇష్టమట. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అందుకే నా ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ అంటే నాకు ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం అంటూ రష్మిక నిర్మొహమాటంగా చెప్పింది. ఆ సినిమా సమంలోనే రష్మిక ప్రేమలో పడటం.. నిశ్చితార్థం కూడా అవ్వడం జరిగింది. కాని నిశ్చితార్థం బ్రేక్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.