ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ ను ఒక మతం మాదిరిగా ఆరాధిస్తారు. క్రికెటర్లను దేవుళ్ల మాదిరిగా అభిమానిస్తూ ఉంటాం. జాతీయ క్రీడ కాకున్నా కూడా ఇండియాలో క్రికెట్ అంటే తెలియని వారు ఉండరేమో. ఇండియా ప్రస్తుతం సాధిస్తున్న అద్బుత విజయాలతో వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తుంది. అయితే 1983 కు ముందు క్రికెట్ అంటే పెద్దగా తెలియదు. క్రికెట్ ఆడేవారిని పని పాట లేని వారిగా భావించే వారు. ఎప్పుడైతే కపిల్ దేవ్ సేన ఇండియాకు ప్రపంచ కప్ ను తీసుకు వచ్చిందో అప్పటి నుండి ఇండియాలో క్రికెట్ దశ తిరిగి పోయింది.
ప్రస్తుతం క్రికెట్ ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి 1983లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడాలని ఆశగా ఉంటుంది. కాని అప్పటికి ఉన్న టెక్నాలజీ కారణంగా ఇప్పుడు ఆ వీడియోలు లేకుండా పోయాయి. ఆ విజయాన్ని ఇప్పుడు ఇండియన్ క్రీడాభిమానులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు దర్శకుడు కబీర్ సింగ్ చేస్తున్న ప్రయత్నమే '83'. అప్పటి టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా అప్పటి ఇతర టీం సభ్యుల పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
కపిల్ తో పాటు అప్పటి జట్టు సభ్యుల బాడీ లాంగ్వేజ్ నుండి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్.. ఆట శైలి.. కాస్ట్యూమ్స్ ఇలా ప్రతి ఒక్కదాన్ని చాలా పరిశోదించి దర్శకుడు నటీనటుల ఎంపిక మరియు వారికి ట్రైనింగ్ ఇప్పించడం చేశాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. కపిల్ తో పాటు ఇతర టీం సభ్యులను దించేసినట్లుగానే రణ్ వీర్ సింగ్ మరియు ఇతర నటులు ఉన్నారు.
ఈ ఫస్ట్ లుక్ తో అప్పటి అద్బుత విజయాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లుగా చూపించడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు. కేవలం హిందీలో మాత్రమే కాకుండా సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో నాగార్జున తమిళంలో కమల్ హాసన్ లు ఈ చిత్రాన్ని సమర్పించేందుకు ముందుకు వచ్చారు.