పబ్లిసిటీ కొత్త పోకడలు పోతోంది. సినిమా ఓపెనింగ్స్ కు ప్రమోషన్ చాలా కీలకంగా మారుతోంది. హీరో చిన్నా పెద్దా సంబంధం లేదు. జనానికి రీచ్ అవ్వాలి అంటే ఏదో కొత్తగా ఆలోచించాలి. లేదంటే మొదటి రోజు వసూళ్లలో తేడాలు వచ్చేస్తాయి. అందుకే సూర్య కొత్త సినిమా నిర్మాతలు వినూత్నమైన ప్లాన్ తో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారని చెన్నై టాక్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించిన ఎన్జికె(నంద గోపాల కృష్ణ) షూటింగ్ చివరిదశలో ఉంది. 14న వాలెంటైన్ డే సందర్భాన్ని పురస్కరించుకుని దీని ట్రైలర్ ని ఐదు రాష్ట్రాల్లోని ముఖ్యమైన థియేటర్లలో అభిమానుల సమక్షంలో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ-తమిళనాడు-కర్ణాటక-కేరళ ఇలా ఎక్కడిక్కడ భారీ ఎత్తున ఎన్జికె సందడి చేయబోతున్నట్టు టాక్. గత కొన్నేళ్లలో ఇంత అట్టహాసంగా ట్రైలర్లు రిలీజైన సినిమాలు బాహుబలి 2-శంకర్ 2.0 మాత్రమే. సూర్యది ఈ వరుసలో మూడోది అవుతుంది.
ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందినట్టు సమాచారం. సాయి పల్లవి- రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి సూర్యతో జట్టు కట్టారు. జగపతిబాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఏడాదికి పైగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమాపై మాములు అంచనాలు లేవు. గత ఏడాది గ్యాంగ్ తో జస్ట్ యావరేజ్ హిట్ అందుకున్న సూర్య తెలుగులో బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విడుదల తేది ఇంకా ఖరారు చేయని ఎన్జికె తెలుగు వెర్షన్ కూడా తమిళ్ తో పాటే సమాంతరంగా రిలీజ్ కాబోతోంది. మరి దీని గురించి ఇంకా బాగా అవగాహన రావాలంటే ట్రైలర్ వచ్చేదాకా ఇంకో 12 రోజులు ఆగాల్సిందే.