మహనీయుల బయోపిక్ వివాదాలు నిరంతరం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్టీఆర్.. జయలలిత వంటి ప్రముఖుల బయోపిక్ లు నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలిచాయి. అమ్మ జయలలిత బయోపిక్ సెట్స్ లో ఉండగానే ఇటీవల రకరకాల వివాదాలతో వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డా. అబ్దుల్ కలాం బయోపిక్ ఈ తరహాలోనే వివాదాల్లోకి నిలుస్తోంది.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై ఒకేసారి రెండు బయోపిక్ లకు సన్నాహాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పింక్ జగ్వార్స్ నిర్మిస్తున్న కలాం బయోపిక్ ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు హస్యనటుడు అలీ .. కలాం పాత్రదారిగా నటిస్తున్నారు. అయితే కలాం బయోపిక్ తీసే హక్కు తమకు మాత్రమే ఉందంటూ నిర్మాత.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ వ్యతిరేకించడం ఫిలిం వర్గాల్లో వైరల్ గా చర్చకు వచ్చింది. కలాం బయోపిక్ రైట్స్ తమకు మాత్రమే చెందుతాయని .. ఆ మహనీయుని జీవితంపై ఏ భాషలోనైనా సినిమా లేదా డాక్యుమెంటరీని నిర్మించే హక్కు తమకు మాత్రమే ఉందని అభిషేక్ వాదిస్తున్నారు. త్వరలోనే కలాం బయోపిక్ వివరాల్ని వెల్లడిస్తామని ఆయన మీడియాకి వెల్లడించడం తో తాజా బయోపిక్ వివాదాస్పదం అవుతోంది.
అలీ ప్రధాన పాత్రలో పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్- ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో జగదీష్ దానేటి దర్శకత్వంలో అబ్దుల్ కలాం బయోపిక్ ఇప్పటికే తెరకెక్కుతోంది. పీపుల్స్ ప్రెసిడెంట్ గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కలాం బయోపిక్ కి భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ పోస్టర్ లాంచ్ లో ప్రామిస్ చేశారు. ఇక ఇందులో నాలుగు దశాబ్ధాల కెరీర్ అనుభవం ఉన్న అలీ నటిస్తున్న 1111వ చిత్రంగా మరో అరుదైన రికార్డును ప్రస్థావించారు. అబ్దుల్ కలాం బయోపిక్ తో హాలీవుడ్ లోకి అలీ అడుగుపెడుతున్నారు. హాలీవుడ్ నటి లిలియన్ రేవ్.. బాలీవుడ్ దర్శక నిర్మాత మధుర్ భండార్కర్.. బీజేపీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ రామచంద్ర రావు తదితరులు సమక్షం లో జవేద్కర్ నేతృత్వం లో కలాం బయోపిక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా వివాదం నేపథ్యంలో అభిషేక్ నామా రూపొందించనున్న బయోపిక్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. అయితే లెజెండ్ అబ్దుల్ కలాం బయోపిక్ పేరుతో వివాదాలు తెరపైకి రావడం ఆయన్ని అవమానించడమే. తాజా వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని కలాం పేరు అభాసుపాలు కాకుండా కాపాడతారనే అభిమానులు భావిస్తున్నారు. ఇక అలీ ఇంతకాలం కమెడియన్ గా మాత్రమే కొనసాగారు. ఆయన ఇమేజ్ కి కలాం బయోపిక్ ఎంతవరకూ సూటబుల్ అన్న సందేహాన్ని కలాం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి అలీ ఏమని సమాధానమిస్తారో చూడాలి.